ఏ.పి.లో తెలుగు సాంస్కృతిక కళోత్సవాలు

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన కళాబృందాలకు బహుమతులు మరియు పారితోషకాలు…
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ…

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు- తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుట కొరకు, కళలను మరియు కళాకారుల అభివృద్దిని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు మరియు కళా బృందాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహింపబడుతున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి రోజా తెలిపారు.

పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి వంగపండు ఉష, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆకాడమీల చైర్మన్/ చైర్‌పర్సన్ల పర్యవేక్షణలో సాంప్రదాయ, జానపద మరియు గిరిజన నృత్యరీతుల కళాకారులకు మరియు గాత్ర (సింగింగ్) పోటీలు నిర్వహింపబడతాయి.

పోటీలలో పాల్గొనదలచిన కళాకారులు పేరు/Artiste Name, కళారూపం/Art Form, చిరునామా/Address, జిల్లా/Districts, జోన్/Zone, ల్యాండ్ లైన్/ Land line, మొబైల్ నెంబర్/Mobile Number, ఈమెయిల్/E-mail, ఆధార్ నెంబరు/Aadhar Number, విద్యార్హత/Educational Qualification, ప్రస్తుత వృత్తి/Present Occupation, సాంప్రదాయ కళారూపం/ Traditional Art Form, శిక్షణ పొందిన కళాకారుడు/ Trained Artiste, అనుభవం సంవత్సరాలలో/ Years of Experience, ఇతర వివరములు (పురస్కారాలు, సాధించిన విజయాలు మొ…), Other Information If Any ఈ వివరాలతో కూడిన దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, 2వ అంతస్థు, దుర్గాపురం, విజయవాడ – 520003 లేదా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/ పాఠశాలల (విజయనగరం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు) నందు దరఖాస్తును పొంది పూర్తిచేసిన దరఖాస్తును అక్కడే సమర్పించవచ్చు లేదా పూర్తిచేసిన దరఖాస్తును apculturalcompetitions@gmail.com మెయిల్ ద్వారా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వెబ్ సైటులో (https://culture.ap.gov.in/) దరఖాస్తును పూర్తిచేయడం ద్వారా కూడా నవంబర్ 10, 2022 తేది లోపల సమర్పించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి కార్యాలయం వారిని చరవాణి 0866-2434380/390 ద్వారా సంప్రదించాలని… కళాకారులకు తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న కళాకారులకు తిరుపతిలో (నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురము, నంద్యాల, కర్నూలు జిల్లాల కళాకారులకు) నవంబర్ 19,20,21 తేదిలలో మహతి కళాక్షేత్రం నందు, గుంటూరులో(ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, యన్.టి.ఆర్, కృష్ణ జిల్లాల కళాకారులకు) నవంబర్ 24,25,26 తేదిలలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమహేంద్రవరంలో (ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కళాకారులకు) నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదిలలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో అలాగే విశాఖపట్నంలో (అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కళాకారులకు), డిసెంబర్ 7, 8, 9 తేదిలలో వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆడిషన్స్ నిర్వహింపబడతాయన్నారు.
◆◆◆◆●●●●◆◆◆◆
గెలుపొందిన కళాకారులు విజయవాడలో డిసెంబర్ 19,20 తేదిలలో నిర్వహింపబడే రాష్ట్రస్థాయి పోటిలలో పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన కళాబృందాలకు బహుమతులు మరియు పారితోషకాలు అందజేయబడతాయని మంత్రి రోజా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap