హకీంజాని, బెల్లంకొండలకు ‘ఎ.పి.రచయితల సంఘం భాషా పురస్కారాలు’
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తులకు తెలుగు భాషా పురస్కారాలను ప్రకటించింది. వేలాది వ్యాసాల ద్వారా తెలుగు భాష, సంస్కృతిని పరివ్యాప్తం చేసిన తెనాలికి చెందిన షేక్ అబ్దుల్ హకీంజానీకి, బాలల్లో ఆసక్తికరంగా ఆలోచనల్ని రేకెత్తించే విధంగా బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న చెన్నైకి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త బెల్లంకొండ నాగేశ్వరరావుకు ఈఏటి తెలుగు భాషా పురస్కారాలకు రచయితల సంఘం కమిటీ ఎంపిక చేసింది. వీరికి ఆగస్ట్ 29న జరిగే ప్రత్యేక సభలో వీరిని ప్రముఖుల సమక్షంలో నగదు, సన్మాన పత్రం, శాలువాతో రచయితల సంఘం సత్కరించనున్నది.