శ్రీమతి సంగీత అల్లూరి గారు, నివాసం యూసఫ్ గూడ, హైదరాబాద్.
ఒరిస్సా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఆర్ట్స్ (బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్) లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు.
7-8 సంవత్సరాల వయస్సు నుండే కళల్లో ప్రవేశం. ఒకపక్కన చదువుకుంటూనే, మరోపక్కన కళారంగంలో ఎన్ని రకాలుగా చేయ్యచ్చో అన్ని రకాలుగా తనలోని “కళాతృష్ణ”ను ఆచరణ ద్వారా ప్రదర్శించేవారు. సంగీత గారు చాలావరకు ఒరిస్సాలోనే చదువు, జీవనం జరిగింది.
*స్కెచింగ్, *క్యారికేచర్, *పట్ట చిత్ర (ఒరిస్సా),
*రాజస్థాని మినియేచర్ ఆర్ట్స్, *రాజస్థానీ జ్యూవలరీ, *కెటిల్ ఆర్ట్స్,
*కేరళ మ్యూరల్ ఆర్ట్స్, *పరస్పెక్టివ్ వ్యూ,
*ఫ్రిజ్ మేగ్నేట్స్, *డోక్రా విత్ క్లే,
*డూడ్లింగ్, *జెంట్యాంగిల్ (జపనీస్) ఆర్ట్స్,
*కాశ్మీర్ ఆర్ట్స్, *కలంకారీ,
*మధుబనీ, *తంజావూర్ పేయింటింగ్స్,
*చేరియాల్ ఆర్ట్స్, *గోండ్ ఆర్ట్స్,
*వర్లీ ఆర్ట్స్, *క్లే మ్యూరల్ ఆర్ట్స్,
*బాటిల్ ఆర్ట్స్, *నిర్మల్ పేయింటింగ్స్,
*ఫ్యాబ్రిక్ పేయింటింగ్స్, *గార్డెనింగ్ వర్క్స్,
*స్కూల్ ప్రాజెక్ట్ వర్క్స్, *బొటిక్ ఆర్ట్స్,
*ఎంబ్రాయిడరీ వర్క్స్,
*రంగోళి……. ఇలా అన్నింటిలోనూ ఆల్ రౌండర్ గాను, ఓ మంచి కళాకారిణిగాను గుర్తింపు రావడం చాలా సంతోషం, సంతృప్తిగా వుందన్నారు.
ఇకపోతే “ఫ్యాషన్ డిజైనర్” గా అవ్వాలనుకున్నారు, కాని అనివార్యకారణాలవల్ల కాలేకపోయానని, ఆ విషయంలో అసంతృప్తిగానే మిగిలిపోయందని వెల్లడించారు.
ఇండియాలో వున్న అన్ని రకాల ట్రెడిషనల్ కళలను, ఇప్పటి యువతకు తగ్గట్టుగా ఆ కళలను మార్చి “ఓ ట్రెండ్ స్వెట్టర్”గా నిలవాలని సంకల్పంతో ఉన్నానని అన్నారు సంగీత గారు.
భవిష్యత్ లో నా ఈ కళలను అవసరమైనవారికి శిక్షణ ఇవ్వాలని ఆశయమని వివరించారు.
సంగీత గారు ఎక్కడ నివాసం ఉన్నా ఆ యా ప్రాంతాలలో స్నేహితులకు వివిధ రకాల ఆర్ట్ వర్క్ లను చేసి ఇస్తుంటారు సంగీత గారు.
*తూలి ఆర్ట్ ను ఆరురోజులపాటు షాజీ సుబ్రహ్మణ్యన్ గారి దగ్గర,
*క్లే మ్యూరల్ ఆర్ట్ ను మురళీధర్ గారి దగ్గర,
*తంజావూర్ పేయింటింగ్స్ ను డా.ప్రహ్లాద్ గారి దగ్గర నేర్చుకున్నానని వివరించారు.
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒకసారి గ్రూప్ ప్రదర్శనలో పాల్గొన్నారు. పిడిలైట్ కంపెనీ అధ్వర్యంలో ఫ్యాషన్ & ఇంటీరియర్ కాలేజ్ లో వర్క్ షాపులను, మరియు రవీంద్రభారతిలో ఫ్యాషన్ షో ను నిర్వహించారు.
ఫ్యాబ్రిక్ పేయింటింగ్స్, మరియు బొటిక్ వర్క్స్ ఆర్డర్ పై చేస్తుంటారు.
చివరిగా “ఏ రంగంలో అయినా రాజకీయం, పోటీ సహజం. వాటన్నిటినీ తట్టుకుని, దాటుకుని ముందుకు వెళ్ళడమే” అంటున్నారు శ్రీమతి సంగీత అల్లూరి గారు.
డా. దార్ల నాగేశ్వర రావు