ఈ ఆగస్టులో కేంద్ర లలిత కళాఅకాడమీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం “అజాది కా అమృతోత్సవం ” కార్యక్రమంలో మన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాలను డిల్లీలో ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల స్వాతంత్ర్య వీరుల గురించి ఆ రాష్ట్రాల నుండి కూడా చిత్రాలు ప్రదర్శించబడతాయి.
ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటులో మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవి ప్రకాష్ గారి కృషి మెచుకోతగ్గది. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయుటకు అనుమతి కోసం లలిత కళా అకాడెమీ వారికి దరఖాస్తు చేసి, పలు మార్లు ఫోన్ చేసి అకాడమీ అధికారులను అభ్యర్థించగా ఈ స్వాతంత్ర్య యోధుల చిత్ర ప్రదర్శన డిల్లీలో నిర్వహించాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది.
ఈ 18 మంది చిత్రకారులు చిత్రించిన 25 చిత్రాలు, చిత్రకారుల వివరాలతో, ప్రదర్శన అనంతరం పుస్తక ప్రచురణ (మోనోగ్రాం) వెలువరిస్తామని అకాడెమీ వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా మన తెలుగు వారి చిత్రాలు ఢిల్లీలో ప్రదర్శన ఏర్పాటు అయ్యేందుకు కారకులైన శ్రీ రవిప్రకాష్ గారికి, అల్లూరిని తమ తమ సృజనతో వైవిధ్యంగా ఆవిష్కరించిన చిత్రకారులందరికీ అభినందనలు తెలుపుతున్నది 64కళలు.
ఈ చిత్ర ప్రదర్శన డిల్లీలో ఆగస్టు 15 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరుగుతుంది….
-కళాసాగర్
ఈ చిత్ర ప్రదర్శన పాల్గొనే చిత్రకారులు:
పి.ఎస్. ఆచారి, రాజమహేంద్రవరం
ఎన్.ఎస్. శర్మ, రాజమహేంద్రవరం
ఎస్. విజయకుమార్, హైదరాబాద్
వై. సుబ్బారావు, రాజమహేంద్రవరం
యం. ఉదయ్, పాలకొల్లు
తారా నగేష్, రాజమహేంద్రవరం
కె.ఎస్. వాసు, భీమవరం
వెంపటాపు, తణుకు
కె. నూకరాజు, రాజమహేంద్రవరం
టి.వి, విజయవాడ
నడిపల్లి శ్రీధర్, విజయవాడ
ఎన్.వి.పి.యస్.యస్. లక్ష్మి, రాజమహేంద్రవరం
కె. రాజు, రాజమహేంద్రవరం
డా.పి. బాపిరాజు, రాజమహేంద్రవరం
హంపి, రాజమహేంద్రవరం
జి. దుర్గారావు, రాజమహేంద్రవరం
తాడోజు కిరణ్, రాజమహేంద్రవరం
యం. రవిప్రకాష్, రాజమహేంద్రవరం
Great , congrats