చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

తెలుగు నాటక వికాసంలో బాపట్ల పాత్ర అజరామరమైంది.

సింగరాజు నాగభూషణం, కొర్రపాటి గంగాధర వడ్లమూడి సీతారామారావు, మాచిరాజు బాలగంగాధర శర్మ, నిభానుపూడి మురళీ, KST శాయి, PL నారాయణ వంటి అనేక రంగస్థల దిగ్గజాల తరాల వారీ కృషితో తెలుగు నాటక ఆవిర్భాము నుంచి సమాంతరంగా బాపట్ల రంగస్థలం తాను వృద్ది నొందుతూ తెలుగు నాటకారంగాన్ని దేదీప్యమానమ్ చేసింది.

అంతటి విశిష్టత కలిగిన బాపట్ల రంగ చరిత్రను మన్నె శ్రీనివాసరావు శాస్త్రీయ ప్రమాణాలతో రచించిన ఉద్గ్రంధమే ‘భావపురి రంగస్థలి‘ అని డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గ్రాంధాన్ని ఆవిష్కరించుతూ కొనియాడారు.

140 సంవత్సరాల పైబడిన బాపట్ల నాటక చరిత్రను, 250 మంది పైబడిన రంగస్థలీయుల జీవిత చరిత్రలు సమగ్రముగా పరిశోధన చేసి, గ్రంధస్తమ్ గావించి ఈ ప్రాంత చరిత్రకు శాశ్వతత్వం చేకూర్చిన మన్నె నా శిష్యుడు కావటం నాకెంతో తృప్తిగా ఉందని గ్రంధకర్త రంగస్థల గురువు, రాష్ట్ర ప్రభుత్వ NTR రంగస్థల పురస్కార గ్రహీత KST శాయి అభినందించారు.

గ్రంథ విశ్లేషణ గ్రంధకర్త విద్యాగురువు, విశ్రాంత ప్రాచార్యులు పద్యాల గోపీ చంద్రస్వామి చేయగా, మరో విద్యా గురువు విశ్రాంత వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యా పీఠ అధిపతి డాక్టర్ రావూరి వీర రాఘవయ్య మన్నె కృషిలోని శాస్త్రీయతను, విలక్షతను వివరించారు.

ఆవిష్కరణ జరగగానే “చరిత్ర పరిశోధనా చక్రవర్తి” బిరుదు ప్రధానం గావించుతూ గ్రంధకర్త మన్నె శ్రీనివాసరావుని, వారి కృషికి వెన్నెముకలా నిలుస్తున్న సతీమణి లక్ష్మీని కమిటీ వారు ఘనంగా సత్కరించారు.

ఆపై ఈ గ్రంధాన్ని ముద్రింప చేసిన వదాన్యమూర్తి పెనుమెత్స నాగరాజు (చిన బాబు)ని, పరిశోధన వ్యయములొ సింహాభాగమిచ్చిన వంకాయలపాటి హరిబాబుని, తొలి ప్రతిని సిద్ధం చేయటానికి వ్యయాన్ని ఇచ్చిన డాక్టర్ రావూరి వీర రాఘవయ్య, జాగర్లమూడి లక్ష్మి దంపతులను కమిటీవారు ఘనంగా సత్కరించారు.

సంకా వెంకట రామ కుమార్ అధ్యక్షతన బాపట్ల కమ్మ జనసేవా సమితి వారి కళ్యాణమండపాన శనివారం(12-11-22) జరిగిన భావపురి రంగస్థలి ఆవిష్కరణలో పరిటాల యువసేన అధ్యక్షులు దండమూడి ధరణీకుమార్, గుడివాడ ప్రభాకర నాట్యమండలి కార్యదర్శి మట్టా రాజా, యార్లగడ్డ ఫైన్ ఆర్ట్స్ అధినేత యార్లగడ్డ సత్యనారాయణ, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కుతుబ్బుల్లాపూర్ కమ్మజన సేవాసమితి నేత యలవర్తి వెంకట కృష్ణ, బాపట్ల తెలుగుదేశం ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఘంటా అంజి బాబు, భావపురి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నిబానుపూడి శ్రీహరి ప్రకాష్ ప్రభృతులు పాల్గొని రచయిత మన్నె శ్రీనివాసరావు ప్రతిభను, కృషిని కొనియాడుతూ ప్రసంగించారు.

ప్రముఖ సినీ నిర్మాత దాసరి కిరణ్ స్పాన్సర్ వున్న ఈ కార్యక్రమము అసాంతం విజయవంతమవుటలొ కమిటీ ప్రధాన బాధ్యులగు సంకా వెంకట రాంకుమార్, ఏలూరి హరిబాబు, పెనుమెత్స సుబ్బరాజు, వంకాయలపాటి హరిబాబు, పోలూరు సుబ్బారావు ప్రభృతులు కీలక భూమిక వహించారు.

-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap