కీ. శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా చిటిప్రోలు కృష్ణమూర్తి గారి మహాకావ్యం ‘పురుషోత్తముడు’కావ్యానికి చిటిప్రోలు వేంకటరత్నంగారు నాటకీకరణ చేసిన రక్షాబంధం (చరిత్రాత్మక పద్యనాటకం) రక్షాబంధ నిబద్ధు డై మహాత్యాగం చేసిన పురుషోత్తమ చక్రవర్తి పరమోజ్జ్వలగాథ గ్రంథావిష్కరణ.
గుంటూరు హిందూఫార్మసీ కళాశాల స్వామివివేకానంద సెమినార్ హాల్ లో సెప్టెంబర్ 2, 2022 శుక్రవారం సాయంకాలం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి చిటిప్రోలు కృష్ణమూర్తి గారి చిత్రపటానికి పుష్పాలను సమర్పించి, రావి రంగారావు గారు సభాధక్షులుగా సభకు విచ్చేసిన అథిదులను ముఖ్య అథిదులను పరిచయం చేశారు. హిందూఫార్మసీ కళాశాల విద్యార్థినులు దేశభక్తి గీతం ఆలపించారు. శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మీ గారు స్వాగత వచనాలతో సభను ప్రారంభించారు. ఓరుగంటి లక్ష్మీదేవి గారు వేదపండితులు ఆర్యసమాజ అధ్యక్షులు రచయితకు వేద ఆశీస్సులు చేశారు.
ముఖ్య అతిథి డా. మండలి బుద్ధప్రసాద్ గారు మాజీ ఉప సభాపతి ఆంధ్రప్రదేశ్ వారు గ్రంథావిష్కరణ చేసి పద్యనాటకాలకు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని, చిటిప్రోలు వెంకటరత్నంగారు రచించిన రక్షాబంధం నాటకంలో ఎంతో దేశభక్తి, ఇచ్చిమాటకు కట్టుబడటం మాతృదేశం కొరకు దేశరక్షణ కొరకు ప్రాణత్యాగం చేయటం ఇలా ప్రతిసన్నివేశం క్రీ పూ 4వ శతాబ్దానికి సంబందించిన చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా రచించడం చాలా ఆనందంగా ఉందన్నారు. డా. గుమ్మా సాంబశివరావు గారు గ్రంథ సమీక్ష చేస్తూ ప్రతీ ఆంశాన్ని అద్భుతంగా రచించారని వారి హావభావాలను పరకాయప్రవేశం చేసి రచించారని ఇందులో గీతాలను, గేయాలను సన్నివేశానికి తగినట్టుగా ఆకట్టుకున్నాయని సమీక్షించారు. డా. బీరం సుందరరావు గారు, డా. వెలువోలు నగరాజ్యలక్ష్మి గారు అభినందనలు తెలియజేశారు. రచయిత చిటిప్రోలు వేంకటరత్నం గారు తన స్పందనను తెలియ జేశారు. చిటిప్రోలు సుబ్బారావు గారు ఆవిష్కరణ నిర్వహించిన అమరావతీ సాహితీ మిత్రులకు, ఆడిటోరియం ఇచ్చిన హిందుఫార్మసీ కళాశాల వారికి ధన్యవాదములు తెలియజేయారు. చివరగా అమరావతి సాహితీ మిత్రులు ఆధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతూ ముగించారు.
-మల్లిఖార్జునాచారి