విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

(మూడు రోజులపాటు విశాఖలో పిల్లలకు కార్టూన్ శిక్షణా శిబిరం)

బుధవారం(18-5-2022) నాడు విశాఖపట్నంలో బాల వికాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 16-5-2022 నుండి గత మూడు రోజులుగా జరుగుతున్న కార్టూన్ శిక్షణ శిబిరం జయప్రదంగా ముగిసినది. విశాఖపట్నం ఏ యస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో 16-5-2022 నుంచి జరుగుతున్న ఉచిత సమ్మర్ కేంపులో భాగంగా తొలి మూడురోజులు యన్.సి.సి.యఫ్ (నార్త్ కోస్టల్ ఆంధ్రా కార్టూనిస్ట్స్ ఫోరమ్), విశాఖపట్నం వారు పాల్గొని ఈ కేంపుకి హాజరయిన విద్యార్ధినీ విద్యార్ధులకు కార్టూన్లు ఎలాగీయాలో సీనియర్ కార్టూనిస్టులు పి. రామశర్మగారు, టి.ఆర్. బాబుగారు, వందన శ్రీనివాస్ గారు మరియు లాల్ (సదాశివుని లక్ష్మణరావు) గార్లు శిక్షణనిచ్చారు. బ్లాక్ బోర్డు పై బొమ్మలెలా గీయాలో తెలిపారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరిరోజు 18-5-2022 నాడు యన్.సి.సి.యఫ్ తరఫున విద్యార్ధులందరికీ గుత్తుల శ్రీనివాసరావుగారు వేసిన ఒక చక్కని కార్టూన్ ని ఇచ్చి దాని నమూనా గీయమని నలభైనిమిషాల సమయం ఇచ్చి పోటీపెట్టారు. వివిధ తరగతులకు చెందిన 24 మంది ఉత్సాహంగా పాల్గొని బొమ్మలను గీశారు. యూకేజి, ఒకటో తరగతి, రెండోతరగతి, ఎనిమిదో తరగతి నుంచి ఒక్కరుచొప్పున, 4,6,9,10 తరగతులనుంచి ఇద్దరు చొప్పున, 5 తరగతి నుంచి ముగ్గురు,3 తరగతి నుంచి నలుగురు మరియు 7 తరగతి నుంచి ఐదుగురు పాల్గొన్నారు. వీరిలో స్నేహితశ్రీ, దక్షిత్, లోకేష్, లాస్య, యోగితసంజన, లలీషణ, ఆర్యన్, సాహిత్, చరణ్, ప్రియహాసిని మరియులక్ష్మీచరణ్యలు చాలా బాగా వేశారు.

Children with his cartoons

బాల వికాస ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో కార్యదర్శి నరవ ప్రకాశరావు గారు పాల్గొని ప్రసంగించారు. బాలలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అందుకు ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 40 మంది పిల్లలు పాల్గొన్నారు. కార్టూన్ వర్క్ షాప్ లో బొమ్మలు ఎలాగీయాలో కార్టూనిస్టులూ టి.అర్. బాబు గారు, శర్మగారు,సదాశివుని లక్ష్మణ రావు(లాల్)గారు మరియు వందన శ్రీనివాసరావు గార్లు నేర్పారు. ఈ సమావేశంలో జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ సాంబశివరావుగారు, డాక్టర్ బాబ్జీగారు, చిన్నారావుగారు తదితరులు పాల్గొన్నారు.
బాలలు గీసిన చిత్రాలు ప్రదర్శించారు. అలాగే యన్.సి.సి.యఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలనుంచి కార్టూనిస్టులు వేసిన కొత్తకార్టూన్లను ప్రదర్శించారు. బాలలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్టూన్లను తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap