నా కార్టూనిస్ట్ జీవితంలో అదో మైలురాయి – వెంకట్

పూర్తి పేరు గుద్దంటి వెంకటేశ్వరరావు. పుట్టింది, పెరిగిందీ గుంటూరు జిల్లా బాపట్లలో. అక్టోబర్ 8, 1963న శ్రీ బాలగోకర్ణం, సరళాదేవిలకు జననం. బాపట్ల వ్యవసాయ కళాశాలలో యమ్మెస్సీ (పిజి) పూర్తి చేశాను 1986లో, 1986 డిశెంబర్ నుండి భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉ ద్యోగం. సెప్టెంబర్ 1981 ఆంధ్రసచిత్ర వారపత్రికలో కార్టూనిస్ట్ ‘వెంకట్’గా జననం. దాదాపు 2500 పైగా కార్టూనులు వివిధ దిన, వార, మాస పత్రికలలో 1981 నుండి 1998 వరకూ ప్రచురింపబడ్డాయి. తెలుగులో ఆంధ్రసచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వారపత్రిక మంబ్లీ, స్వాతి సపరివారపత్రిక, మంబ్లీ, జ్యోతి మంబ్లీ, వనితాజ్యోతి, విపుల, చతుర, విజయమంత్రీ, పల్లకి, యువ, జ్యోతిచిత్ర లాంటి దాదాపు అన్నీ తెలుగు మాగజైన్లలోనూ Newstime, Caravan లాంటి ప్రముఖ ఇంగ్లీషు మాగజైన్లలోను, సరిత వంటి ప్రముఖ, హిందీ మాగజైన్లలోనూ ప్రచురింపబడ్డాయి.

హాస్యం మిదవున్న అభిరుచే కార్టూనింగ్ వైపుకు దారిమళ్లించింది. కాలేజీలో చదివేరోజుల్లో మాస్టారు చెప్పే పాఠాలను గాలికి వదిలేసి పుస్తకాల నిండా బొమ్మలు గీసుకుంటూ ఎన్నోసార్లు మాస్టార్ల తిట్ల దండకానికి, ఆగ్రహానికి గురయ్యాను. అయినా నా అభిరుచి మార్చులేకపోయాయి. కార్టూనులను ఎలాగీయాలో, ఎలా పత్రికలకు పంపాలో బేసిక్ సమాచారాన్నంత నా మిత్రుడు శ్రీ బాచి నుండి తెలుసుకున్నాను. అలాగే అన్నం రాజుకూడా తన సహకారాన్ని అందించేవాడు. ఆ తర్వాత కార్టూన్ జయదేవునిగారితో పరిచమయింది. ఆయన నన్ను ప్రోత్సహించిన తీరూ, నన్ను ఉత్తేజింపచేసిన తీరూ మాటల్లో చెప్పలేనిది. ఆయన నన్నో కార్టూనిస్ట్ గా తీర్చిదిద్దారనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఆయనకు కృతజ్ఞతలు ఎలా చెప్పినా తీరేదికావు. కార్టూన్ బ్రహ్మ జయదేవునిగారు మలచిన శిల్పమే ఈ కార్టూనిస్ట్ వెంకట్ అని గర్వంగా చెప్పుకోగలను. అప్పుడు కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే (1982 సం.) నేను రాసే ప్రతీ లెటరకూ ఓపికగా సమాధానాలిస్తూ నన్ను ప్రోత్సహించేవారు. ఆయన మా ఇంట్లో గడిపిన కొన్ని గంటలు నా జీవితంలో మరపురాని అనుభవం. ఆయనతో ఇంటరాక్షన్ నాలో ఇప్పటికీ ఉత్సాహాన్ని, ఉ త్తేజాన్ని నింపుతూ వుంటుంది.

Venkat cartoon on ATM charges

అలాగే కార్టూన్ అంటే గుర్తుకువచ్చే కొంటె బొమ్మల బాపుగారన్నా, ఆయన బొమ్మలన్నా అందరికీ మించి నాకు చాల ఇష్టం. ప్రాణం. కార్టూన్లు గీసేటప్పుడు ఆయన్ని అందరిలాగే నేనూ ఫాలో అయ్యేవాడిని. ఇంగ్లీషుకు Oxford Dictionary లాగా కార్టూనిస్టుకు ఆయనో Dictionary ఆయనో ప్రబోధ గ్రంధం వీలున్నప్పుడల్లా ఆయన బొమ్మలను, ఆయన రైటింగ్ ను ప్రాక్టీసు విపరీతంగా చేసేవాడ్ని, 1986లో ఆంధ్రప్రభ సచిత్ర మాసపత్రిక జన్మదినోత్సవ సందర్భంగా పెట్టిన కార్టూనుల పోటీలో ప్రధమ బహుమతి. 1986లో జ్యోతిచిత్ర, సినిమాపత్రిక, నిర్వహించిన పోటీలో బహుమతి, 1989 స్వాతి సచిత్రవారపత్రిక, నిర్వహించిన సబ్జెక్ట్ కార్టూనుల పోటీలో ఉత్తమ సబ్జెక్ట్ కార్టూన్ గా బహుమతి ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక, న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్, అమెరికా వారు సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో 1985 నుండి 8 సార్లు బహుమతులు సంపాయించుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ సంవత్సరం విడుదల చేసే తెలుగు క్యాలండర్ లో బ్యాంకు వివిధ స్కీమ్ లమీద 1999 నుండి నేటి వరకూ నేను కార్టూనులు గీస్తూవున్నాను. (SBI సర్కిల్ మేనేజ్ మెంట్ కమిటీ వారికి గౌరవమర్యాద పూర్వక ధన్యవాదాలతో), ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ రామకృష్ణగారు, శ్రీ ‘సత్యమూర్తి’గారు 1999 ముందు ఈ కార్టూనులు గీసేవారు. ఆ అదృష్టం నన్ను వరించడం నాకు ఎంతో ఆనందం. బ్యాంకులో నాకు లభించిన అపూర్వ గౌరంగా భావిస్తాను. దాదాపు నేటికి 22 సంవత్సరాలు నన్ను ఎంతోమంది పెద్ద పెద్ద అధికారులకు ఈ ప్రక్రియ సన్నిహితులను చేసింది. మా బ్యాంక్ లో నా కార్టూనిస్ట్ జీవితానికి ఇదో మైలురాయిగా భావిస్తుంటాను.

మా బ్యాంక్ ఇనహౌస్ మేగజైన్స్ అన్నింటిలోనూ, IBA Bulletion అనే Bankers Magazineలోనూ నా కార్టూన్ వచ్చేవి గతంలో.
పేరు చూడకుండానే ఇది ‘వెంకట్’ వేసిన కార్టూన్ అని గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన, ఉత్సాహం ఆలోచనలు అయితే వున్నాయి కానీ ఉద్యోగ భాద్యతలతో అది ఇంకా కార్యరూపం దాల్చలేదేమో అనిపిస్తుంటుంది.

ఆర్. కె. లక్ష్మణ్ గారి కార్టూనులను అమితంగా ఇష్టపడతాను. బాంబ్ మొత్తాన్ని ఓ అంగుళం సైజులోనే బొమ్మలు గీసి చూపించేసత్తా, స్టైల్ ఆయనకే సొంతం. తెలుగులో బాపుగారు, జయదేవునిగారి, సుభానిగారి కార్టూనులు ఇష్టం. అభిమానం. 1980 – 1990 సం. ఆ ప్రాంతాల్లో వారం వారం విడుదలయ్యే మేగజైన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేవాడ్ని. ఎవరి కార్టూనులు వచ్చాయో, ఎలా గీశారో?, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో? అన్న ఆదుర్తా ఇంట్రెస్ట్, ఉత్సాహం వుండేవి. కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చిన సమూల మార్పులతో కార్టూన్ రంగం, కార్టూన్ దాదాపు అవశాన దశకు వచ్చాయోమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓ పెద్ద గ్రంధమో, వ్యాసమో, నవలో తెచ్చే మార్పును ఓ నాలుగు అంగుళాల కార్టూన్ తెస్తుందనడంలో ప్రయత్నం అతిశయోక్తి లేదు. ఇది జగమెరిగిన సత్యం. ఈ వాడీ వేడి తగ్గిన కార్టూన్ రంగాన్ని నిలబెట్టడానికి, పూర్వపు వైభవం తేవడానికీ కృషిచేస్తున్న మాగురువుగారు జయదేవుని గార్కి, శ్రీ కళాసాగర్ గారికి శతకోటి వందనాలు. ‘వెంకట్’ని మర్చిపోయిన వెంకటేశ్వరరావుకే ఫోన్ చేసి మరీ నీ కార్టూనులు, స్టైల్, ప్రెసెంటేషన్ అద్భుతంగా వుంటాయంటూ మరీ నన్ను ప్రోత్సహించిన, ప్రోత్సహం ఇస్తున్న జయదేవునికి, ‘వెంకట్’ పాదాభివందనాలతో…
-వెంకట్

Venkat cartoon on Doctors
Venkat cartoon on Bank loans
Venkat cartoon

Venkat cartoon
Venkat cartoon on Boss and employee

8 thoughts on “నా కార్టూనిస్ట్ జీవితంలో అదో మైలురాయి – వెంకట్

  1. నమస్కారం!
    “నా కార్టూనిస్ట్ జీవితం లో మైలురాయి”—వెంకట్.
    ఎవరి గురించి వాళ్ళు (గొప్పలు) చెప్పుకోవడం సహజమైపోయిందినేడు.
    కాని…… ఆయన గురించి రాసిన(ఫస్టు పర్సన్వి ధానం లో రాసుకున్న) దాన్ని చదివిన దానికంటే…..
    ఆయన గీసిన(ప్రింటయిన వాటిల్లో చివరిది) కార్టూన్ “అత్యంత అద్బుతం” గా వుంది. ‌ఇది పాత సినిమాల్లో
    ఒక వ్యక్తి పడుకుంటే, అతని “ఆత్మ” లేచి, ఇవతల కి వచ్చి, నడవడం లాగా
    ఉదా:‌అల్లూరి సీతా రామరాజు చిత్రంలో వస్తాడే నా రాజు ఈ రోజు
    అన్న పాటలో విజయనిర్మల వచ్చినట్లు….
    నా చిన్నప్పటి నుంచి పత్రికల్లో అనేకవేల కార్టూన్ చూసాను.
    కానీ…..ఇలా వైవిధ్యం తో కూడిన కార్టూన్ చూడలేదు.
    ఆశ్చర్యం, ఆనందం కలిగింది నాకు.
    శ్రీ”వెంకట్” గారూ! మీ ఆలోచన+ ప్రతిభ కు “అభినందన కుసుమాంజలి.”

    “కళామిత్ర”‌ అడివి శంకరరావు.
    మేకప్ ఆర్టిస్ట్-హైదరాబాద్

    1. కళామిత్ర అడివి శంకరరావు గారికి నమస్సులతో ..
      మీ విశ్లేషణ తో మీ సహృదయం మీ పెద్ద మనసు నేను అర్ధం చేసుకోగలిగాను. నా గురుతుల్యులైన శ్రీ జయదేవుని గారి తర్వాత అంత ఉత్సాహాన్ని ఉతేజాన్ని మీ మాటలు నాలో కలిగించాయి. ఇది యధార్ధం. నిజానికి నిజ జీవితంలో PGచేసినా కార్టూన్ జీవితంలో మాత్రం నేను నేటికీ LKG నే. ఎంతో సాధించేద్దాం అని అనుకుంటూ ఊహల్లో జీవించడం అలవాటైన నాకు మీ మాటలు ఎంతో ఉరటనిచ్చాయి .
      మంచి కార్టూన్స్ తో నా మీద మీకున్న మంచి అభిప్రాయాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను సార్ .
      వెంకట్ నే మర్చిపోయిన ఈ వెంకటేశ్వరరావును గుర్తు చేసిన64 కళల కళాసాగర్ గారికి, పెద్ద మనసుతో దీవించి అభినందించిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ…..
      వెంకట్

  2. షేక్ సుభాని,కార్టూనిస్ట్, జర్నలిస్ట్ says:

    చాలా సంవత్సరాల తర్వాత మీ పూర్తి పరిచయం చూశాను .. అప్పట్లో మీ శైలి వేరుగా ఆకట్టునే విధంగా ఉండేది..

    1. సుభాని గారూ,
      మీ అమూల్యమైన అభిప్రాయానికి, అభినందనలకు
      ధన్యవాదాలు సర్ .
      విత్ బెస్ట్ విషెస్,
      వెంకట్

  3. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

    కార్టూన్ అనేది అద్భుతమైన కళ. ఇలాంటి అద్భుతకళాకారులను పరిచయం చేస్తున్న వేదికలో ప్రముఖ కార్టూనిస్ట్ * వెంకట్ * గారి పరిచయం, ఆయన కృషి, అభిప్రాయాలు గొప్పగా వున్నాయి. వెంకట్ గార్కి, మీకూ అభినందనలు. –బొమ్మన్.

    1. బొమ్మన్ గారికి ,
      మీ అభినందనలకు కృతజ్ఞతలు .
      కార్టూనింగ్ లో Bomman శైలి అద్భుతం ఎందరికో ఆదర్శం. కీపిట్ అప్ సర్ .
      ధన్యవాదాలతో ,
      వెంకట్

  4. వెంకట్ గారు మీ పరిచయం బాగుంది.మీ కార్టూన్లు బాగున్నాయి.

  5. Suggestion is the soul of a joke అంటారు. మీ గీతలు కూడా suggestive గా చూడగానే నవ్వు పుట్టించాయి . మీ గీతలు కార్టూన్ గీర్వాణ
    ము కు ప్రతీకలు. అనొచ్చు
    నా పేరు రమణ మూర్తి నేనూ బతక లేక బ్యాంక్ ఉద్యోగం చేసిన వాడనే. ఆంధ్రా బ్యాంక్ లో రిటైర్డ్ మీ కార్టూన్ పరిచయం చేసింది అడం రాజు గారు మీ Ag B sc సహాధ్యాయి .నమస్కారములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap