జానపద చిత్రకళా వైతాళికుడు

జానపద చిత్రకళా వైతాళికుడు

(నవంబర్ 13, 14 తేదీలలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైడిరాజు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంధర్భంగా ప్రత్యేక వ్యాసం) తెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసిన కళాప్రపూర్ణుడు అంట్యాకుల పైడిరాజు, తెలుగునాట దామెర్ల రామారావు తర్వాత ఆ వైతాళికుని కృషిని కొనసాగించిన మహాకళాకారుడు ఆయన. పైడిరాజు చిత్రకారుడు, శీలే కాదు, కవి, కథకుడు, గాయకుడు, నటుడు కూడా!…

చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

“కన్ను తెరిస్తే జననం , కన్ను మూస్తే మరణం,తెరచి మూసిన మధ్య కాలం మనిషి జీవితం అన్నాడుఒక గొప్ప కవి ఎన్నోఏళ్ళక్రితం. లిప్త పాటైన ఈ మధ్య కాలాన్ని ఏ ప్రత్యేకత లేకుండానే సాధారణ జీవితాన్ని సాగించేవాళ్ళు కొందరైతే , తనదైన ప్రత్యేకత మరియు ఒక లక్ష్యంతో సాధారణ జీవనానికి భిన్నంగా కొనసాగే వాళ్ళు ఇంకొందరు . ప్రతిభా…

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

  “కళ” అన్న  పదాన్ని ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించినా  వ్యక్తి తనలో కలిగిన సృజనాత్మక శక్తితో   ఎదుటవారిని రంజింప జేయాడానికి చేసే ఒక ప్రయత్నం” కళ “ అని చెప్పవచ్చు .ఆ కళ ద్వారా సమాజాన్ని ఆనందింప జేయడం మాత్రమే గాక వ్యక్తి తాను తన కుటుంభం  కుడా అన్నివిధాలా ఆనందం పొందినప్పుడు ఆ కళ కు మరింత  సార్ధకత ఏర్పడుతుంది. దురద్రుష్టవశాత్తు ఆ అదృష్టం అందరిని వరించదు. కొందరికే…

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, రైటర్ మోహన్ గారి స్మృతిలో….!! అనగనగనగా.. అవి తెలుగునాట 336 ఛానళ్లు లేని రోజులవి. దినపత్రికలు, వారపత్రికలే.. ప్రజలకు నిత్య సమాచార, వినోద సాధనాలుగా ప్రచండభానులై ప్రజ్వలిస్తూ.. మంచో, చెడో, యమ గడ్డుగానో సాగిపోతున్న రోజులవి. సరిగ్గా ఆ రోజుల్లో.. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వ్యంగ్య చిత్రకళా సామ్రాజ్యాన్ని ఎడాపెడా ఏలూతూ.. ఆ రాజ్యంలోని…

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

September 12, 2018

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా… స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో…వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో… ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన అధ్యాయం భారత స్వరాజ్య సంగ్రామం. ఈ త్యాగధనులకు, ఈ కర్మధనులకు, ఈ పుణ్యపురుషులకు, ఈ సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి కర్తవ్యం. గురుతరమైన బాధ్యత, ఇది నిస్సందేహం.  ఈ 72వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా,ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి, ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. డా. దీర్దాసి విజయభాస్కర్. ఆంధ్రప్రదేశ్భా షా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ఓ గొప్ప కార్యక్రమానికి సంకల్పించారు. స్వరాజ్యవీరులకు ఘననివాళి సమర్పించాలని నిశ్చయించారు. అదిగో… అలా.. డా.విజయభాస్కర్ సంకల్పం నుండి ఉ ద్భవించింది. “స్వాతంత్ర భారతికి చిత్రకళాహారతి” అనే విశిష్టమైన కార్యక్రమం. అజ్ఞాతులైన ఎందరో స్వాతంత్ర్య వీరుల, దివ్య రూపాలకు ప్రాణప్రతిష్ఠ…