‘నర్సిం’ కు బెస్ట్ కార్టూనిస్ట్ గా నేషనల్ అవార్డ్…

‘నర్సిం’ కు బెస్ట్ కార్టూనిస్ట్ గా నేషనల్ అవార్డ్…

అనేక పత్రికలలో గత 35 యేళ్ళుగా కార్టూన్లు గీస్తూ, ప్రస్తుతం నవ తెలంగాణ దిన పత్రికలో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్న నర్సిం కు ప్రెస్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు 2018 సంవత్సరానికి బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ విభాగంలో ‘బెస్ట్ కార్టూనిస్ట్’ గా నేషనల్  అవార్డ్ ప్రకటించారు. ఇది తెలుగు కార్టూనిస్టులకు దక్కిన గౌరవంగా మనం…

మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

యెల్లా వెంకటేశ్వరరావు సప్త సముద్రాలు ఏకమైన ఘోషను మీరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ… మనసుతాకే ఆ మధుర తుఫారాలను ఆస్వాదించారా? మృదంగ వాయిజ్యం అంటే ప్రక్క వాయిజ్యంగా పడిఉన్న రోజుల్లో… ఓ విద్వాంసుడు నేనున్నానంటూ వచ్చి చెలరేగాడు… వేలికొసలతో వేవేలనాదాలు సృష్టించి ప్రేక్షకులను ఆనంద తాండవమాడించాడు. మృదంగంపై ప్రయోగాలే ప్రాణప్రదంగా, సంగీత సునామీలు సృష్టించిన ఆలయరాజు, మనసంగీత వైభవాన్ని…

అతివగా అభినయం… అజేయం…

అతివగా అభినయం… అజేయం…

భారతీయ సంప్రదాయం నృత్యరీతులలో కూచిపూడికి ప్రత్యేకస్థానం ఉంది. నృత్యనాటికలు, రూపకాలు, శాస్త్రీయనృత్య ప్రదర్శనలతో ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో పాటు, సమకాలీన అంశాలను కూడా ఇతివృత్తాలుగా తీసుకుని ప్రజల మనసుల్లోకి నవరసాల్ని చొప్పించగల మహత్తర సాధనం నాట్యం. ఆంధ్రరాష్ట్రానికి అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను అందించిన అపురూపమైన నాట్యకళా ప్రక్రియగా కూచిపూడి ఎంతగానో ప్రఖ్యాతి గాంచింది. అలనాటి కూచిపూడి నాట్య దిగ్గజాలు…

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. 2015లో మేము నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తరువాత మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం…

కళాసాక్షి లేపాక్షి

కళాసాక్షి లేపాక్షి

‘లేపాక్షి’ అనగానే ముందు గుర్తువచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నమైన ‘నంది’, దీనితో పాటు అడవిబాపిరాజు నందిపై వ్రాసిన ‘లేపాక్షి బసవయ్య-లేచిరావయ్య’ అనే గీతం. అంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే ఆ నంది పేరుతోనే మన రాష్ట్రభుత్వం అవార్డులను ప్రతిభావంతులైన కళాకారులకు ప్రతియేటా అందజేస్తోంది. నందిలేని శివాలయం లేదు. బసవన్నలేని వ్యవసాయం లేదు. ఎద్దు రంకెవేస్తే రైతు హృదయం పొంగిపోతుంది….

చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

“కన్ను తెరిస్తే జననం , కన్ను మూస్తే మరణం,తెరచి మూసిన మధ్య కాలం మనిషి జీవితం అన్నాడుఒక గొప్ప కవి ఎన్నోఏళ్ళక్రితం. లిప్త పాటైన ఈ మధ్య కాలాన్ని ఏ ప్రత్యేకత లేకుండానే సాధారణ జీవితాన్ని సాగించేవాళ్ళు కొందరైతే , తనదైన ప్రత్యేకత మరియు ఒక లక్ష్యంతో సాధారణ జీవనానికి భిన్నంగా కొనసాగే వాళ్ళు ఇంకొందరు . ప్రతిభా…

60 ఏళ్ళు నిండిన “పసిపాపడు”

60 ఏళ్ళు నిండిన “పసిపాపడు”

అమాయకంగా నవ్వటం, నవ్వించటం, కవ్వించటం, ‘లవ్వించటం’ తప్ప అన్నెం-పున్నెం ఎరుగడు. ఎవర్ని ఏమీ అడగడు, తన దగ్గరున్నదేదో ఒకటివ్వకుండా ఎవర్నీ పోనివ్వడు. బాపూ గీసిన ‘బుజ్జయీ లా వుంటాడు, లొకం తెలిసిన ‘పాపాయి ‘ లా వుంటాడు. పొద్దస్తమానం… రాతలు గీతలే వ్యాపకం, రాత్రి-పగలు అన్నది వుండనే వుండదస్సలు జ్జాపకం. తెలుగు బుల్లి తెరకై సీరియస్ గా ‘సిల్లీసీరియల్స్’…

నడిచే సరస్వతి … మన చాగంటి…

నడిచే సరస్వతి … మన చాగంటి…

October 9, 2018

ఆయన మాట్లాడినా, వద్యం చదివినా.. ఆబాలగోపాలానికి శ్రవణాలలో అమృత ధారకురిసినట్లు ఉ oటుంది. అలవోకగా చెప్పే ఆ ప్రవచన ధార… ఆ విశ్లేషణా, ఆ వివరణలు నదీ ప్రవాహాన్ని సెలయేళ్ళని, జలపాతాలను, ఉప్పొంగుతున్న తరంగాలను జ్ఞప్తికి తెస్తాయి. యువజనంలో సైతం ధార్మికచైతన్యం, భక్తి ప్రవత్తులు పొంగిపొర్లుతాయి. సంస్కృతి సంప్రదాయం మూర్తీభవించిన వ్యక్తిగా… స్వచ్ఛమైన అచ్చ తెలుగు పంచకట్టుతో నిరాండబరునిగా…

అహెూ.. సుయోధనా.. అచంట…

అహెూ.. సుయోధనా.. అచంట…

అద్భుత, సహజ హావభావాలు, వాక్పటిమ, సంభాషణా సంవిధానం, ఠీవి ఆయన సొంతం. సుయోధనుడిగా రాజసం ఉట్టిపడే నడక, గంభీరమైన సంభాషణలు, నిండైన రూపం ఆ పాత్రకు పెట్టిన ఆభరణాలు. వికటాట్టహాసం చేస్తూ ‘మానుటయా… మనుగడ సాగించుటయా’ అంటూ అభిమాన ధనుడైన దుర్యోధనుడు అంతర్మధనం చెందే విధానాన్ని తన నటనా వైదుష్యంతో సుస్పష్టంగా చూపించ గల ప్రతిభాశాలి. ఆయనే అపర…

అలసెంద్రవంక గోరటి వెంకన్న

అలసెంద్రవంక గోరటి వెంకన్న

గోరటి వెంకన్నఈ పేరు చెబితే మనశ్శరీరాలు పులకించిపోతాయి. అతని పాట మన రక్తనాళాల్లో సంలీనమై ప్రవహిస్తుంది. ఈ ముద్దుబిడ్డని కన్నతల్లి ఈరమ్మ. తండ్రి నర్సింహ్మ, ఏప్రిల్ 4, 1964న వెంకన్న కెవ్వుమన్న తొలిరాగంతో మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం పల్లె ధన్యతనొందింది. మూడో తరగతి వరకు గౌరారంలో, తర్వాత పదోతరగతి వరకు రఘపతిపేటలో చదువుకున్నారు. కల్వకుర్తి…