పరిపూర్ణ జీవి – గొల్లపూడి మారుతీరావు
December 28, 2019వార్తాపత్రికల్లో కలం పదును చూపాడు. ఆకాశవాణి ద్వారా గళం వినిపించాడు. స్టేజీ పైన నాటికలు, నాటకాలను కూర్చాడు. వెండితెర వెలుగుకు కథలు సమకూర్చాడు, మాటలు రాశాడు. ఆ పైనే తానే నటుడయ్యాడు. బుల్లితెరకు వ్యాఖ్యానాలు చెప్పాడు. సాహిత్యంలో ఎక్కడ చూసినా తానే పరిమళాలు జల్లాడు- ఎనభై సంవత్సరాల జీవితంలో ఇన్ని పనులు ఒక్క వ్యక్తికి సాధ్యమా? అవును- సుసాధ్యం…