కళలు పిల్లల్లో  మానసిక వికాసాన్ని పెంచుతాయి  – చిదంబరం

నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పరీక్షలు వ్రాసి అలసిపోయిన చిన్నారులకు ఆటవిడుపుగా ఉండేందుకు మరియు వారిలో అంతర్లీనంగా దాగిఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే మఖ్య ఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ వారి ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులను ముఖ్య అతిథిగా విచ్ఛేసిన సీనియర్ ఆర్టిస్ట్ చిదంబరం ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భముగా చిన్నారి చిత్రకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కళ పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతుందని , తల్లిదండ్రులు వారి పిల్లలకు వారికీ నచ్చిన కళారంగాల్లో శిక్షణ ఇప్పించాలని  కోరారు. గౌరవ అతిధిగా విచ్చేసిన అమరావతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ బి.కె. దుర్గారావు మాట్లాడుతూ లలితకళల ద్వారా రెగ్యులర్ స్టడీస్ కి ఎంతో మేలు జరుగుతుందనీ… ఒక ఎనర్జీ టానిక్ లాగా మానసికోల్లాసానికి దోహదపడుతుందన్నారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆర్టిస్ట్ యు.వేణుగోపాలరావు మాట్లాడుతూ… చిత్రలేఖనంలో ప్రావీణ్యం వున్న విద్యార్థులు మెడికల్,ఇంజినీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూయలరీ డిజైనింగ్,యానిమేషన్ వంటి రంగాలలో చక్కగా రాణించగలన్నారు. గత 15 సంవత్సరాల నుండి చిన్నారులకి చిత్రలేఖనం పట్ల అవగాహన కల్పిస్తూ… తగిన తర్ఫీదునీస్తూ.. వారు తమ తమ రంగాల్లో స్థిరపడేందుకు కృషి చేస్తున్న స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సేవలను వీరంతా ప్రశంసించారు. అనంతరం డైరెక్టర్ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి శెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ వేసవి శిక్షణా తరగతులలో భాగంగా సేవ్ ట్రీస్ అనే అంశంపై మెగా ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు 9849355339 నెంబర్ నందు సంప్రదించవచ్చునన్నారు. కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ జి.స్నేహ పర్యవేక్షించగా.. యువ చిత్రకారులు జగదీష్, స్మిత, అమూల్య, సాత్విక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link