సంతోషానికి సంకేతం… దీపావళి

సంతోషానికి సంకేతం… దీపావళి
తిమిర సంహారం చేసే వెలుగుల కేళి…దీపావళి
చిమ్మ చీకట్లను చీల్చే మిరుమిట్లు గొలిపే దివ్వెలకాంతి …దీపావళి
దుష్టశక్తులను దునుమాడిన ఆనందం…దీపావళి
కష్టాలను కడతేర్చి… ఇష్టాలని ఇచ్చేపర్వం…దీపావళి

ఆబాలగోపాలానికి ఆహ్లాదం….దీపావళి
అమావాస్యను ‘పున్నమి’గా మలచు… సందేశం…దీపావళి
మానవ జీవన సమరాన విజయానికి సూచికైన… దీపావళి పండుగ
మీ ఇంట వింత కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ…

64కళలు.కాం పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు…

-బి.ఎం.పి. సింగ్

Share via
Copy link
Powered by Social Snap