భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ, చిత్రకళోపాధ్యాయులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరొందిన సంస్థ విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి. 9వ జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన, బహుమతి ప్రదానోత్సవం ఏప్రిల్ 9న, శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ బాలోత్సవ్ భవన్ లో ఘనంగా జరిగింది. 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించిన గోళ్ళ నారాయణరావుగారు మాట్లాడుతూ బాల చిత్రకారులను ప్రోత్సహిస్తున్న ఇంత పెద్ద ఎత్తున ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహిస్తున్న ఆర్ట్ అకాడెమి ఫౌండర్ రమేష్ ను అభినందించారు. ముఖ్య అతిధిగా వచ్చిన AP Industrial Infrastructor Corporation, Vice Chairman, మేనేజింగ్ డైరెక్టర్ జె.వి.ఎన్. సుబ్రమణ్యం గారు పోటీలలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేసి, చిత్రకళోపాధ్యాయులను, ప్రముఖ చిత్రకారులను సత్కరించారు. ముఖ్య అతిధి సుబ్రమణ్యంగారు మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రామంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు.
ఈ పోటీలో ఏ.పి., తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, అస్సాం, ఒరిస్సా, అగర్తల రాష్ట్రాల నుండి సుమారు 60 పాఠశాలల నుండి రెండువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చిత్రకారులు సన్నాల, ఒస్మాన్ ఖాన్, ఎన్.వి.పి.ఎస్. లక్ష్మి, డా. ఎన్. రవికుమార్, మెండా మోహన్ రావు, వెంపటాపు, రవీంద్ర, పి.సుధాకర్, బి. సూర్యనారాయణ, ఐ.సిహెచ్. సత్యనారాయణ, అమీర్ జాన్, యం. పార్థసారధి, బి.వి.ఎస్. రమేష్, బైరు రమేష్, రాఖీ, కె.పి. బాబు తదితరులు సత్కారాలు అందుకున్న వారిలో వున్నారు.
నైస్ ప్రోగ్రాం …పిల్లలలో సృజనా త్మక శక్తి ని వెలికి తీసి వారిని ప్రోత్స హించుటలో డ్రీమ్ యంగ్గ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ సొసైటీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం నిర్వాహకులు డ్రీమ్ రమేష్ గారికీ కళాసాగర్ గారికి అభినందనలు