ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కొణిదెల రామ్ చరణ్ @ చెరీ (36) పోటీదారుగా ఉన్నారు … ఈ మొదటి ఎపిసోడ్ నే కర్టెన్ రైజర్ గా చెప్పుకోవచ్చు ….
బేసికల్లీ, ఈ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ను ముందు ముందు వచ్చే పోటీదారులకు, చూసే వీక్షకులకు ఒక మార్గదర్శిని లాగా, గైడ్ లాగా ఉపయోగపడుతుంది ….
హోస్ట్ అయిన జూనియర్ ఎన్ టీ ఆర్ సూట్ (టై తో)లో ఆకర్షణీయంగా కనిపించాడు… గ్రే కలర్ సూట్ అనిపించింది … కోట్ లపెల్ + టై మరీ స్లిమ్ గా ఉన్నాయి …. రామ్ చరణ్ మాచింగ్ సూట్ (టై లేకుండా) వేసుకున్నాడు … పింక్ / గులాబీ రంగు కోట్ బాగుంది… కోట్ లపెల్ బ్రాడ్ గా ఉంది … ఇద్దరు హీరోలు కూడా స్మార్ట్ గా ఉన్నారు… రామ్ చరణ్ మొహం కొంచెం అలసినట్లు ఉంది … జూనియర్ ఎన్ టీ ఆర్ కంఠం కొంచెం స్ట్రెయిన్ అయ్యేటట్లు ఉంది… సినెమా షూటింగుల్లో దొరికినంత రిహార్సల్స్ / విరామం ఇక్కడ షూటింగుల్లో దొరక్కపోవచ్చు …
మిగతా నియమ నిబంధనలు మామూలే … 15 ప్రశ్నలూ… 3 లైఫ్ లైనులు… అన్నింటికీ జవాబులు చెప్తే కోటి రూపాయలు మొదటి బహుమతి … 3 లైఫ్ లైనులు అంటే 1. ఫిఫ్టీ – ఫిఫ్టీ… 2. ఆడియెన్స్ పోల్ … 3.. వీడియో కాల్ ఏ ఫ్రెండ్…. అయితే ఈ మొదటి ఎపిసోడ్లో నెగ్గిన ప్రైజ్ మొత్తాన్ని “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్” కు ఇవ్వడానికి రామ్ చరణ్ ముందుకొచ్చాడు… ప్రశ్నలూ జవాబులూ తెలుగూ ఇంగ్లీష్ భాషల్లో ఉన్నాయి…. దాదాపు అదే ఫార్మాట్, అదే సిగ్నచర్ ట్యూన్…. బ్రాడ్ గా అదే ఫ్రేమ్ లోకి ఉంచి, చిన్న చిన్నవి కొన్ని మార్చాల్సింది ….
మొదటి 2 ఎపిసోడ్ లు చూశాను…. ఎంతగానో ఎదురు చూశాను … ఆ తృప్తి కలగలేదు … ఆ రోజులలో సిద్ధార్థ బసు క్విజ్ మాస్టర్ గా చేసేవాడు … ఖంగుమని మోగే గొంతుక… మొత్తం సబ్జెక్ట్ మీదనే కాక, షో మీద ఫుల్ కమాండ్ …. ఆ తర్వాత అమితాభ్ బచ్చన్ …. సిద్ధార్థ బసు క్విజ్ మాస్టర్ గా చేసేటప్పుడు అంతా ఆంగ్లం…. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం దేశమంతా ఎదురు చూసేవాళ్ళు …. అమితాభ్ బచ్చన్ సమయంలో హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ క్విజింగ్ జరిగేది…. అమితాభ్ కు సహజసిద్ధంగానే రెండు భాషల మీద ఉన్న పట్టు వలన కార్యక్రమం రక్తికట్టేది… ఇక హిందీ సామెతలు, జాతీయాలు, చతురలు విరివిగా దొర్లిపోయేవి… గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన మహిళలు, యువకులు కూడా ఆయన మీద సెటైర్ లు వేసేవారు (ఆయన డిగ్నిటీకు భంగం కలగకుండా), ఆయనా ఎంజాయ్ చేసేవారు …. ఆ తర్వాత తెలుగులో వచ్చిన నాగార్జున అంతంత మాత్రమే … చిరంజీవి సో సో … హిస్ట్రియోనిక్ టాలెంట్స్ వేరు, క్విజింగ్/ క్విజ్ మాస్టర్ రోల్ వేరు … తర్వాత ఈనాడులో విద్యార్థులు కోసం ఒక క్విజ్ ప్రోగ్రామ్ వచ్చేది … “బాలాదిత్య” …. ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం (1991) తెలుగు చలన చిత్రంలో బాలనటుడిగా చేశాడు (రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా) … “బాలాదిత్య”ను చూశాక హమ్మయ్య ఇక ఫర్వాలేదు మనకూ ఒక మంచి క్విజ్ మాస్టర్ దొరికేశాడు అనుకున్నాను …
క్విజ్ ప్రోగ్రామ్ అంటే ప్యూర్ క్విజింగ్ మట్టుకే ఉండాలి… స్వంత విషయాలు, చిత్ర పరిశ్రమ విషయాలు, వ్యక్తిగత విషయాలు, Vested interests ఉండరాదు…. రామ్ చరణ్ ను ఒక ప్రశ్న అడిగారు … ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరం లోని ఓపెరా హౌస్ ఫోటో చూపించి, అదేమిటి అని… ‘ఆరంజ్’ సినిమా చాల వరకు ఆస్ట్రేలియాలో షూట్ చేశారు… ఆయన్ను ఆ ప్రశ్న అడగడం ఎంత వరకు సబబు? … అలాగే రామ్ చరణ్ ను మరో ప్రశ్న అడిగారు … కొమురం భీమ్ గురించి… ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్ కలిసి చేస్తున్న సినిమాలో ఇద్దరు హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలు చేస్తున్నారు …
ఈ క్విజ్ (జ్ఞాన పరీక్షలు) గురించి ఇంకొంచెం చెప్పాలని ఉంది… తెలంగాణా రాష్ట్రంలో A SECTION OF STUDENTS కు శ్రీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక విద్యా దాతగా, వేగు చుక్కగా ఒక తరం తరం మొత్తం గుర్తు పెట్టుకుంటుంది…. అదే కోవలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో A SECTION OF STUDENTSకు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక విద్యాదాతగా, ప్రభుత్వ పాఠశాలల ధర్మకర్తగా ఒక తరం తరం మొత్తం గుర్తుంచు కుంటుంది…. అదే మాదిరి జూనియర్ ఎన్.టీ.ఆర్ అంటే “ఉభయ రాష్ట్రాల” విద్యార్ధి లోకం విద్యార్థినీ విద్యార్థుల్లో ఒక విజ్ఞాన కాంక్ష రగిలించి, మేల్కొలిపిన (IGNITING YOUNG MINDS) ఒక యువ హీరోలా కలకాలం గుర్తుండిపోవాలి…. జూనియర్ ఎన్.టీ.ఆర్ వలన నైనా విద్యార్థుల్లో BOOK READING … గ్రంథ పఠనం ఇంటింటా ఒక హాబీగా వెలుగొందాలి…. ఆ ప్రధ బంగాల్ రాష్ట్రం లో ఉంది… అక్కడ పుస్తకాలు బాగా చదువుతారు… పుస్తకాలు బాగా కొంటారు… ఇలాంటి జ్ఞాన పరీక్షల పోటీల్లో ముందుంటారు … ఒక సెల్యులాయిడ్ హీరో ఒక విజ్ఞానానికి పురిగొల్పే కధా నాయకుడిగా METAMORPHOSIS మార్పు చెందాలని నా అభిలాష… చలన చిత్రాల్లో ఒక 6 నెలలు, క్విజ్ కార్యక్రమాల తయారీలో ఒక 6 నెలలు ఉండి, తెలుగు భాషకు సంబంధించి FATHER OF TELUGU QUIZ అనిపించుకోవాలి జూనియర్ ఎన్.టీ.ఆర్…. సిద్ధార్థ బసును “గ్రాండ్ ఫాదర్ అఫ్ ఇండియన్ క్విజ్” అంటారట …
అందరికీ క్విజ్ (జ్ఞాన పరీక్ష) శుభ కామనలతో…
ఇది ప్రారంభం మాత్రమే … ముందు ముందు ఇంకా మెరుగు పడుతుందని ఆశిస్తాను …
క్విజ్ మాస్టర్ కు నా శుభాశీస్సులు …
-సునీల్