తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన చెందిన క్రియేటీవ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించిన చిత్రకళా పోటీలలో 23 రాష్ట్రాలకు చెందిన 215 మంది చిత్రకారులు పాల్గొన్నారని అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి తెలియియజేశారు. వీరిలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృశ్య కళ అకాడమి చైర్మన్ శ్రీమతి కుడిపూడి సత్య శైలజ భరత్ ప్రకటించడం జరిగింది.
దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో మొదటి స్థానాలలో
- నబిన్ దాస్, న్యూఢిల్లీ
- శంకుంతల, రాజస్థాన్
- అల్లు రాంబాబు, విజయవాడ ఎంపిక అయ్యారు వీరు కాక
* గోల్డెన్ బ్రష్ అవార్డుకి 26 మంది చిత్రకారులు స్థానం సంపాదించగా
* గ్రేట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ గా 81 మంది
* బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ గా 71 మంది
* క్రియేటివ్ ఆర్టిస్ట్ గా 37 మంది చిత్రకారులకు అవార్డులు ప్రకటించి వారికి ఆన్లైన్ లో ప్రశాంసాపత్రాలు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా దృశ్య కళ అకాడమి చైర్మన్ శ్రీమతి కుడిపూడి సత్య శైలజ మాట్లాడుతూ… ప్రతీ వ్యక్తి మానసిక ఉల్లాసానికి.. తమలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ అయిన చిత్రకళ… క్రాఫ్ట్ వర్క్ మీద ఆశక్తి… మరింతగా పదును పెట్టడానికి.. మరెన్నో కొత్త ఆవిష్కరణలు సృష్టించడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని…ఈ పోటీలలో పాల్గొన్న ప్రతీ చిత్రకారునికి అభినందనలు తెలుపుతూ… రానున్న కాలంలో క్రియేటివ్ హార్ట్స్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరగాలని అంజి ఆకొండి ని అభినందించారు…
ఈ కార్యక్రమంలో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ అధ్యక్షులు అంజి ఆకొండి, ఉపాధ్యక్షులు చక్రవర్తుల రామయ్య, సెక్రటరీ స్ఫూర్తి శ్రీనివాస్, కన్వీనర్ ఎమ్ రాధాకృష్ణ, మహిళా కన్వీనర్ పి.వి.వి. మహాలక్ష్మి , వై.సి.పి సీనియర్ నాయకులు కుడిపూడి శాంతిభుషణ్, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ ఉభయగోదావరి జిల్లాల కన్వీనర్ ఆకొండి ఉమామహేష్, హైందవ పరిషత్ అధ్యక్షులు పురాణపండ భాస్కర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చిత్రకళా పోటీలను ఏ విధమైన ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహించడం అభినందనీయం.
దన్యవాదములు