మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారం
యాభై ఏళ్ల చరిత్రగల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా ఎన్నికైన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని మా కార్యాలయంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు, అధ్యక్షుడు ఏ. ప్రభు, కార్యదర్శి పర్వతనేని రాంబాబులతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి, మా జనరల్ సెక్రెటరీ శివబాలాజీ, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అబ్దుల్, మల్లికార్జున్, జిల్లా సురేష్, కుమార్, వీర్ని శ్రీనివాస్, నవీన్, మురళి పాల్గొన్నారు.. అనంతరం కె. లక్ష్మణరావు విష్ణు మంచును శాలువతో సత్కరించగా, అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి రాంబాబు ఫ్లవర్ బొకేలను అందించారు.