విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు
*20 మంది చిత్రకారులతో రెండు రోజులపాటు ‘ఆర్ట్ క్యాంపు’
*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

శుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో గత 15 సంవత్సరాలుగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయ విధానం ద్వారా గోవులను పెంచుతూ పంటలను పండిస్తూ ఎందరో రైతులకు శిక్షణ సలహాలు ఇస్తున్న విజయరామ్ గారి నేతృత్వంలో విశాఖపట్నం సింహాచలం లోని గోశాలలో ఐదు రోజులపాటు ప్రకృతి వ్యవసాయ విధానం గురించి సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోమాత గొప్పదనం ఏమని వర్ణించాలి. వ్యవసాయం, పాడి, గృహప్రవేశం అంతేనా.. తల్లీపిల్ల అనుబంధం కూడా గోమాత, ఆవు దూడ నుంచే నేర్చుకోవాలేమో. గోమాత లేకపోతే ఈ ప్రపంచమే ఉండదేమో. గోమూత్రం, పాలు, అవు పేడ.. ఇలా గోమాత వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలియజెప్పేందుకు సేవ్ స్వచ్ఛంద సంస్థ నడుంకట్టింది.

నా ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇప్పించేందుకు విశాఖపట్టణంలోని కృష్ణాపురం సమీప కొత్త గోశాల వద్ద మార్చి 22 నుంచి 26వ తేదీ వరకు సేవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విజయరామ్ గారి అధ్వర్వర్యంలో ఓ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘శబలా భోజనాల పండగ’ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖ వక్తలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో రైతులు మరియు ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకునేవారు మరియు అనేక రకాల ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే వినియోగదారులు అక్కడికి వచ్చారు.
కాలుష్యం లేకుండా : రోజుకు వెయ్యిమంది భోజనాలు చేసినా అక్కడ ఏవిధమైనా చెత్త పేరుకుపోకుండా స్టీల్ కంచాలలోభోజనం వడ్డించారు, స్టీల్ గ్లాస్ లలో మంచినీటిని అందించారు.

గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో..
గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో, సంప్రదాయ విధానంలో చేసిన వంటలతో రోజూ వెయ్యి మంది రైతులకు, ఇక్కడ భోజనాలు వడ్డించారు.

ప్రదర్శన: ఇంకా ఇక్కడ దేశీయ వరి విత్తనాలు, కాయకూరల విత్తనాలు, వందేళ్ళ నాటి ఇత్తడి, రాగి పాత్రలు, ప్రదర్శన మరియు అమ్మకాలు జరిగాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన రెల్లు గడ్డితో, తాటాకులతో బుట్టల అల్లే నైపుణ్యతకలవారు, కలకత్తా నుండి మట్టితో బొమ్మలు చేసే కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, మన మూలాలను గుర్తుచేశారు.

నువ్వులు, వేరుశనగలను నుండి చెక్క గానుగతో నూనె తీయుట ప్రదర్శన మరియు అమ్మకాలు చేసారు. పాలను చిలికి వెన్నతీయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం మొత్తం చెట్ల నీడలో తాటాకు పందిరిలో ఆహ్లాదకరంగా ఐదు రోజుల పాటు జరిగింది.


రెండు రోజుల ఆర్ట్ క్యాంప్: ఈ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలు రెండు రోజులపాటు కళలు డాట్ కామ్ ఎడిటర్ యల్లపు కళాసాగర్ సారధ్యంలో ప్రకృతి వ్యవసాయంలో, మన సంస్కృతిలో గోవుపాత్రను తెలియజెబుతూ 20 మంది చిత్రకారులతో ఆర్ట్ క్యాంపు నిర్వహించారు.
ఈ చిత్రాలలో గోమాత గొప్పతనాన్ని చూపించారు. ప్రకృతి వ్యవసాయంలో, మన సంస్కృతిలో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఓ గొప్ప అనుభూతి పొందామని విశాఖకు చెందిన ఉమారాజు సాగి తెలిపారు. గోమాత గొప్పతనాన్ని ఈ పెయింటింగ్స్ ద్వారా మరో మారు తెలుసుకోగలిగామన్నారు.
రెండవ రోజు కార్యక్రమానికి వచ్చిన రైతులు, వినియోగదారులు, కళాభిమానులు చిత్రకళా ప్రదర్శనకు విచ్చేసి తమకు నచ్చిన ఏడు పెయింటింగులను కొనుగోలు చేశారు.

‘ఆర్ట్ క్యాంపు’లో పాల్గొన్న చిత్రకారుల వివరాలు:

1) Atmakuri Ramakrishna (Vijayawada)
2) Kalasagar Yellapu (Vijayawada)
3) Shiv Kumar K.V. (Vijayawada)
4) Nageswara Rao K. (Chillangi-Kirlampudi)
5) Mallikarjuna Achari V. (Guntur)
6) Veeru Pendyala (Mandapeta-E.G.dist)
7) Justice Vajragiri (Vinukonda)
8) PolaRaju Ch. (Visakhapatnam)
9) Karunakar Rajeti (Vizianagaram)
10) Ch. GopalaRao (Parvathipuram)
11) B. Kiran Kumar (Visakhapatnam)
12) Raja Rambabu (Anakapalli)
13) P. Chidambaram (Vijayawada)
14) Allu Rambabu (Vijayawada)
15) Ch. Ramachandra (Anakapalli)
16) J. Janaki Ram (Visakhapatnam)
17) Veera Brahmam (Eluru)
18) A. Ravi (Parvatipuram)
19) Kolli Srinivas (Eluru)
20) Renukeswara Rao (Eluru)

‘ఆర్ట్ క్యాంపు’లో పాల్గొన్న పలువురు చిత్రకారుల అభిప్రాయాలు:
_________________________________________________________
శ్రీ విజయరామ్ గారు తలపెట్టిన గొప్ప కార్యక్రమంలో కళను గౌరవిస్తూ అందులోభాగంగా 20 మంది ఆర్టిస్ట్స్ తో ఆర్ట్ క్యాంప్ ఎర్పాటు చేసి అందులో పాల్గొనే గొప్పఅవకాశం కల్పించినటువంటి శ్రీ కళాసాగర్ గార్కి నాహృదయ పూర్వకంగా ధన్యవాదములు, అదే విధముగా యంతోమంది మేధావులు, పండితులు, అలానే గొప్పసృజనాత్మక కళాకారులతో కలసి రెండు రోజులు ఆర్ట్ క్యాంపులో జర్నీ చేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజులుగా భావిస్తున్నాను. అలానే శ్రీ కళాసాగర్ గారు మావర్క్ షాప్ కి వచ్చి తమ విలువైన సమయాన్నిమాతో గడపడం మాఅదృష్టం..
మీ… జానకిరామ్, విశాఖ
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఈ పెయింటింగ్ వర్క్ షాపులో పాల్గొన్న చిత్రకారులు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అరవై డెభ్భై యేళ్లు నిండిన చిత్రకారుల చిత్రాల్లో “సాంప్రదాయ చిత్ర కళ” కన్పిస్తే, యువ చిత్రకారుల పెయింటింగ్స్ లో ఆధునికత, టెక్నిక్, సింబాలిజం కన్పించాయి. అన్నింటికీ మించి సుహృద్భావ వాతావరణంలో ఒకరికొకరు సహకరించు కొని, సలహాలూ సూచనలూ ఇచ్చుకొంటూ, మిత్రుల చిత్రాలు బాగా రావాలనే తపన అందరిలోనూ కన్పించింది. సీనియర్ చిత్రకారుల సలహాలు, సూచనలు వర్ధమాన చిత్రకారులకు చాలా ఉపయోగపడ్డాయి.

వస్తువుల, యంత్రాలు మాయలో పడి తోటివారిని దూరం చేసుకుంటున్న ఈ తరుణంలో రెండురోజుల పాటు నన్ను ప్రకృతికీ, మనుషులకీ దగ్గర చేసిన ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికీ, మరీ ముఖ్యంగా కళాసాగర్ గారికి కృతజ్ఞతలు. మిత్రులందరకీ నమస్కారాలు.
సి. హెచ్. గోపాలరావు, పార్వతిపురం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఈ కార్యక్రమం పూర్తిగా ప్రకృతి ఒడిలో ఏర్పాటు చేయడం పూర్వకాలపు పద్ధతులను అనుసరించడం సహజసిద్ధంగా పండించిన పంటలను వంటలుగా ఏర్పాటు చేయటం ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చాయి. ఈ ఆర్ట్ క్యాంప్ లో భాగంగా చిత్రకారులు చిత్రించిన చిత్రాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఈ ఆర్ట్ క్యాంప్ లో భాగస్వాములను చేసుకున్నందుకు ఆ ప్రకృతి ఒడిలో ఆరోగ్యంవంతమైన భోజనాలను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ ఆర్ట్ క్యాంపును అందరిని ఆర్గనైజ్ చేసుకుంటూ విజయవంతం చేసిన కళాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆర్ట్ క్యాంపు ఎంతో ఆనందాన్ని జీవితంలో ఒక గుర్తుండిపోయే అవకాశం కల్పించారు. ప్రత్యేక ధన్యవాదాలు.

మల్లికార్జున ఆచారి, గుంటూరు

కార్యక్రమ వీడియో ఇక్కడ చూడండి:
https://www.youtube.com/watch?v=m4UrntVTl1U


4 thoughts on “విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

  1. ఈ ప్రక్రియ ఓ గొప్ప ప్రయోగం తో కూడి ఉంది, గోవు మరియు సేంద్రియ పద్ధతుల్లో మానవుని జీవనం పై చిత్ర రచన విజయ్ రామ్ గారు చెప్పినట్టు భక్తి తో చిత్రించారు. ఈ క్యాంప్ లో మము ప్రోత్సహించిన సేవ్ సంస్థ వారికి, కళాసాగర్ యల్లపు గారికి అభినందనలు ధన్యవాదములు.🙏💐

  2. 64 కళలు డాట్ కామ్ ఎడిటర్ యల్లపు కళాసాగర్ సారధ్యంలో మేమంతా ఈ ఆర్ట్ క్యాంపులో పాల్గొన్నాము. గో ఆధారిత వ్యవసాయాన్ని, ఆహారపు రుచిని తెలుసుకున్నాము. మరిందరితో పరిచయం కలిగింది. క్యాంపు చక్కగా నిర్వహించిన ఎడిటర్ / చిత్రకారుడు యల్లపు కళాసాగర్ గారికి ధన్యవాదములు.

  3. ఇది ఒక మంచి కార్యక్రమం ప్రకృతిలో సరదాగా రెండు రోజులు గడపటం మనసుకు అనుభూతిని ఇచ్చింది. బయట హార్ట్ క్యాంపులు జరగటం ఇక్కడ ఆర్తి క్యాంపులు జరగటం ఎంతో ప్రత్యేకతను సంచరించుకుంది నిజంగా ఇందులో పాల్గొన్న ఆర్టిస్టులు అందరికీ వారి జీవితంలో గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం ప్రకృతి ఒడిలో రెండు రోజులు గడపడం అన్నది ఎటువంటి రసాయన పదార్థాలు కలపని ఆహారాన్ని అందించడం వాటిని అందరూ స్వీకరించటం అది ఒక మహాభాగ్యంగా భావించదగినది పార్టీస్ లందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి వారధికా నిలిచిన కళా సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
    మీ మల్లికార్జున ఆచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap