కళాకృష్ణకు తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

ప్రముఖ నాట్య గురు, ఆంధ్ర, లాస్య నాట్యంలో వినుతికెక్కిన అభినవ సత్యభామ కళాకృష్ణ కు ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈమేరకు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ తంగెడ కిషన్ రావు ఫోన్ లో సమాచారం ఇచ్చినట్లు కళాకృష్ణ తెలిపారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రహీత అయిన కళాకృష్ణ భార్య ఉమా మహేశ్వరి కి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి, ప్రతిభ, సిద్దేంద్ర యోగి పురస్కారాలు అందుకున్న కళాకృష్ణ కు ఇవాళ గౌరవ డాక్టరేట్ కూడా ప్రకటించడం విశేషం. ఈనెల 28వ తేదీ జరిగే స్నాతకోత్సవంలో కళాకృష్ణ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.

కళాకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నృత్యకారుడు, నాట్యగురువు. ఆంధ్ర నాట్యం, పేరిణి నృత్యం, కూచిపూడి వంటి నృత్యాలను ప్రదర్శించాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కళ్ళేపల్లి కుగ్రామంలో ఆగస్టు 11,1951 న జన్మించారు. ఇతడు ‘నవజనార్దన పారిజాతం’ నృత్యరూపకం చేయడంద్వారా పేరు గడించాడు. సత్యభామ పాత్రలో అపూర్వమైన అభినయానికి మెచ్చి కళాభిమానులు ఆయనను ‘అభినవ సత్యభామ’ అని ప్రశంసించారు. కళాకారుడిగా, అధ్యాపకుడిగా 45 ఏళ్లుగా సేవలందిస్తూ వేలాది ప్రదర్శనలిచ్చాడు.
రోళ్ల కృష్ణయ్య అంటే ఎవ్వరికీ తెలియదు! అతనే కళాకృష్ణ! ప్రపంచ ప్రసిద్ధ నృత్య కళాకారులుగా గుర్తింపు పొందారు. ఉద్యోగం కావాలా? నాట్యం కావాలో తేల్చుకోమంటే నాట్యం వైపు మొగ్గు చూపిన కళాకృష్ణ విఖ్యాత నాట్యాచార్యులు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ శిష్యులు. పేరిణి నాట్యం తో మొదలుపెట్టి ఆంధ్ర నాట్యం, లాస్య నర్తనంతో ఘనమైన కీర్తి సాధించి తెలంగాణ ఖ్యాతి ని ప్రపంచ వ్యాప్తం చేశారు. ఆయన సత్యభామ పాత్ర ధరించి మైమరపించారు. మహామహులు ఆయన్ని చూసి నిద్ర పట్టని రాత్రులు గడిపారంటే అంత అందమైన అలంకారం కళాకృష్ణ! 45 ఏళ్ల నాట్యకృషిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అభినందనలు కళాకృష్ణ గారు.
1987లో హరిహర నృత్యనికేతన్ స్థాపించి వేలాదిమంది శిష్యులు, ప్రశిష్యుల ద్వారా నృత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. కళాకృష్ణ పేరిణి నట్టువాంగానికి ఎంతో పేరు గడించాడు. ఇతడు పేరిణి లాస్యం ప్రదర్శించడానికి శాస్త్రాల ఆధారంగా రూపకల్పన చేశాడు.

వీరు అందుకున్న పురస్కారాలు, బిరుదులు:
తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం- 2019
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం-2015,
వేదాంత జగన్నాథ శర్మ బంగారు పతకం, నృత్య కిన్నెర-2010
కళా సుబ్బారావు పురస్కారం, హైదరాబాద్-2010
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2009
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస (కళారత్న)-2008
స్థానం నరసింహారావు అవార్డు-2007
అక్కినేని నాగేశ్వరరావు బంగారు పతకం, 2005
బంగారు పతకం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ, హైదరాబాద్ 2004
“అభివ సత్యభామ” – శ్రీ వేంపర్ల సత్యనారాయణ శాస్త్రి-1986


డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap