జూపల్లి అంటే ఒకప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో. ఎప్పుడైతే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువు తీరారో ఇక అప్పటి నుంచి ‘మై హోమ్ సంస్థ ‘ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పేరు ప్రతిరోజు వినిపిస్తోంది. అంతే కాదు జగత్ గురు గా వినుతి కెక్కిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీ హవా కొన సాగుతున్నదో, దాని వెనుక అదృశ్య శక్తిగా రామేశ్వర్ రావు మరింత పాపులర్ అయి పోయారు. ఎంతగా అంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంతులతో కలిసి మాట్లాడేంత సాన్నిహిత్యం పెరిగి పోయింది. ఆయన ఇప్పుడు ఒకరకంగా తెలంగాణ ముకేశ్ అంబానీ. అనకొండలా అన్ని రంగాల్లో విస్తరించింది మై హోమ్ కంపెనీ. దీనికి కర్త కర్మ క్రియ అంతా రామేశ్వర్ రావు తమ్ముడు జూపల్లి జగపతి రావు. నిన్నటి దాకా నిర్మాణ రంగంలో ఉన్న జూపల్లి కుటుంబం ‘TV 9 ‘ కొనుగోలుతో మీడియా లోకి కూడా ఎంటర్ అయ్యింది.
కాగా ఇప్పటి దాకా ఐర్లాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ సీఆర్‌హెచ్ ఇండియాతో కలిసి, ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్ ఇండస్ట్రీస్’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్, జూపల్లి రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గ్రూప్ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందు కోసం వీరు దాదాపు1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు సమాచారం. దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది. 4 ప్లాంట్స్, 10 లక్షల టన్నుల మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం మహా సిమెంట్ బ్రాండ్ పేరిట గ్రే సిమెంట్ తయారీ, సరఫరాలో ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ పాండిచ్చేరి, తదితర 11 రాష్ట్రాల్లో సిమెంట్ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్ గ్రూప్… సిమెం ట్, కన్‌స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది. మొత్తం మీద తెలంగాణాలో జూపల్లి కింగ్ మేకర్ అన్నమాట.
డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మహబూబ్ నగర్ జిల్లా కుడికిళ్ళ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన హోమియోపతి విద్యనభ్యసించాడు. 1979లో దిల్‌షుక్‌నగర్‌లో హోమియోడాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి మై హోం అనే వ్యాపార సంస్థ ప్రారంభించాడు. తర్వాత మహా సిమెంట్స్ అనే సిమెంటు పరిశ్రమను స్థాపించాడు.శంషాబాద్ దగ్గర ఒక హోమియో ఆసుపత్రి నిర్మించాడు. ఇందులో 14 మంది డాక్టర్లు ఉన్నారు. ఇందులో వైద్యం ఉచితం. జీయర్ ట్రస్టు ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు.
1979 లో హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పుడే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పరిచయం అయ్యింది. మొదట హయత్ నగర్ లో ఫ్లాట్లు వేసి కొంత లాభానికి అమ్మారు. తర్వాత ప్రాక్టీసు మానివేసి నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు.
1996లో మహా సిమెంట్స్ సంస్థను స్థాపించాడు. శంషాబాద్ లో ఒక హోమియో ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం అందిస్తున్నాడు. ఇక్కడ పరిశోధనలు కూడా జరుగుతాయి.