ఆధునిక చారిత్రిక కాల్పనిక సాహిత్యం రావాలి!

నేటి యువతరంలో చరిత్ర పట్ల అవగాహన పెరగాలంటే ఆధునిక రీతిలో చారిత్రక కాల్పనిక సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్రనగరి’ ‘ఆంధ్రపథం’ రచయిత, ప్రముఖ చారిత్రక కాల్పనిక రచయిత సాయి పాపినేని అన్నారు. ‘చారిత్రక అవగాహనను ముందు తరాలకు అందించటంమెలా’ అన్న విషయంపై గురువారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి లో జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్, డా. వాడ్రేవు చినవీరభద్రడు మాట్లాడుతూ, చారిత్రక కల్పనా ఆసక్తికరంగా సాగించడానికి ఎంచుకోవలసిన రచనా పద్ధతులపై అనేక వివరాలు అందిస్తూ, రచయితలు, కవులు, వర్ధమాన చరిత్రకారులకు తగిన సూచనలు ఇచ్చారు. ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి, ఆసక్తిగల కవులు, రచయితలకు,
చారిత్రక నేపథ్యంపై మౌలిక సమాచారం, నైపుణ్య రచనా సహకారం, చారిత్రక రచనలు సులువులు, మెలకువలు వంటి వనరులను అందించే వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పారు. సమన్వయకర్త సాయి పాపినేని చర్చ ముగింపు లో ‘చారిత్రక కాల్పనిక సాహిత్యాన్ని’ ఒక ఉద్యమంగా ప్రజల్లో, పుస్తకాలు, ప్రచార మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకెళ్ళే ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ చర్చలో నగరంలోని చరిత్రకారులు, సాహితీ ప్రియులు, రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link