బాలల కోసం కథలు రాస్తూ వారిని చైతన్య వంతంచేసే రచయితలు అతి తక్కువ మందే వున్నారు. అలాంటి రచయితలలో ఈ తరంలో ముందున్న వ్యక్తి ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకరు. వీరు బాలల కోసం అనేక కథా సంపుటాలను ప్రచురించారు. అలాంటి కథా సంపుటాలలో ‘కార్వేటి నగరం కథలు’ సంపుటి ఒకటి.
‘కార్వేటి నగరం కథల’ సంపుటిలో కథలు పిల్లలకి వినోదాన్ని విజ్ఞానాన్ని కల్గిస్తాయి. ఇందులోని ప్రతి కథను చదవాల్సిందే, వాటిని అర్థం చేసుకొని ఆచరించాల్సిందే. ఇందులో మొత్తం 30 కథలున్నాయి, అన్ని కథలు అనేక పత్రికలలో ప్రచురితమైనవే. కథల పరంగా చూస్తే ప్రతికథ పేజీకి మంచకుండా ఉండటం వల్ల చదువురులకు చదవడం శులభంగా వుంటుంది. ప్రతీ కథలోను ఎదో ఒక మంచి సందేశంతో ముగించారు రచయిత..
ఈనాడు పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలను వివాహం సమయంలో ప్రతి తల్లి తండ్రి భరోసా ఇవ్వాలి. అది ఎటువంటి భరసా అని తెలుసుకోవాలంటే ‘సిసలైన పెళ్ళి కానుక’ కథ చదవాల్సిందే. ప్రతి జీవికి స్వేచ్ఛ అవసరం మనుషులు కాని, జంతువులు కాని పక్షులు కాని స్వేచ్ఛ అనేది లేనప్పుడు వాటిలో జీవకళ ఉండడు అనిచెప్పేకథ ‘గగన విహారం’. ఎల్.ఎస్.ఆర్.డబ్ల్యూ. అనే నాల్గు అక్షరాలను బాగా తెలుసుకొంటే చాలు, చదువు దానంతట అదే వస్తుంది, పిల్లల జీవితం బాగుంటుందని తెలిపే కథ ‘నడిచే బిడ్డలు పుట్టరు కదా!’. ప్రతి మనిషికి ఎదో ఒక అనారోగ్యం వస్తూ వుంటుంది. అనారోగ్యం ఉందని మనం చేసే పనులను చేయకుండా వుంటే రోగం పెరిగే అవకాశం ఉంది. మనో ధైర్యం కోల్పోయి, రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంది. మరి అనారోగ్యంతో బాధ పడేవారికి సరైన వైద్యం ఏమిటి అంటే ‘దేశానికి సేవ కథ’ చదవాల్సిందే. అన్నం మెతుకును కనుకొన్నది ఎవరు? అని మన పిల్లలు మనల్ని ప్రశ్నస్తే దానికి సమాధానం చెప్పటం కష్టం. అదే రైలు, విమానం, వాచి కనుగొన్నది ఎవరంటే సమాధానం చెప్పవచ్చు. ఇంత కస్ఠతరమైన ప్రశ్నకు సమయస్ఫూర్తితో సమాదానం చెప్పికథ అలోచింపచేసే కథ ‘అన్నం మెతుకు కథ’ చదవాల్సిందే. ఇటు వంటి అనేక కథల సమాహారమే ‘కార్వేటి నగరం కథలు’ మొత్తంగా పుస్తకం పిల్లలకు చాలా ఉపయుక్తం. రచయిత అభినందనీయులు.
–విష్ణుభొట్ల రామకృష్ణ 9440618122
కార్వేటి నగరం కథలు,
వెల: రూ.140/-
ప్రతులకు: 9393662821