విజయవాడ సక్సెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ కు సంబంధించిన సంతోషాన్ని బుధవారం (29-9-21) విజయవాడలో డీవి మేనార్ సమీపంలోని ఓ ప్రయివేట్ టెలికం సంస్థ కార్యాలయంలో ‘లవ్ స్టోరి’ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో పంచుకున్నారు. కొత్త తరహా సినిమా చేస్తే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించారని, ఇది తనకు ఒక ప్రత్యేకమైన సినిమా అని, భారీ హిట్ కావాలని మాత్రం తీయలేదన్నారు. తాను తీసే ప్రతి సినిమాలో తాను నమ్మిన భావజాలం (తన వాయిస్ ) కనిపిస్తుందన్నారు. ఈసినిమాలో ఆపరమైన విషయాన్ని మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుందని చెప్పారు. ఫిదా తరువాత మూడేళ్ల గ్యాప్ లో ఈ ఒక్క సినిమా కోసమే చాలా శ్రమ పడినట్లు తెలిపారు. సినిమా హిట్ అయింది అనేంతవరకు విశ్రాంతి లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి, అమీరఖాన్ ఈసినిమా రిలీజ్ ఫంక్షన్ కి వచ్చి ఎంతో హైప్ కి తీసుకువచ్చారన్నారు. ఆలిండియా లెవెల్ లో ఈసినిమా విజయం కనిపించిందన్నారు. ఈసినిమా విజయం లోసినిమాకు పనిచేసిన అందరి కృషి ఉందన్నారు.
సినిమాలో డాన్స్ పట్ల నాగ చైతన్య భయపడుతూ ముందే చెప్పినా, సాయిపల్లవితో పాటు ధీటుగా డాన్స్ చేశారాన్నారు. కేవలం డాన్స్ మాత్రమని కాకుండా జుంబాను మిక్స్ చేసి వినోదంతో పాటు వ్యాయమానికి ఉపయోగ పడేలా చాలా ట్రిక్స్ వాడామని, ఇవి ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. జుంబా డాన్స్ కి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కోరియో గ్రాఫర్ శేఖర్, జానీ మాస్టర్స్ మంచి డాన్స్ రూపొందించరన్నారు.ఇప్పటివరకు వచ్చిన నా 9సినిమాల్లో ఒకదానిలా మరొకటి లేకుండా భిన్నంగా ప్రతి సినిమా చిత్రీకరించటం, అందులోను సామాజిక సందేశాన్నో, వార్తల్లోవచ్చే సమస్యలపట్ల స్పందిస్తూ ఏదో ఒక మెసేజ్ ను ఒక్కో సినిమాలో చెప్పుకుంటూ వచ్చాను. అటువంటి మెసేజెస్ ఇచ్చి చక్కగా స్టోరీ ని మలిపితే ప్రేక్షకులు ఆదరిస్తారనే ధైర్యం నాకు వచ్చిందన్నారు. తానేప్పుడు సింపుల్ గా ఉండటమే ఇష్టమని, సంపాదన పెరగగానే అహం రావటం, గర్వాన్ని ప్రద్రర్శన చేయటం నచ్చదన్నారు. గోదావరి సినిమానుంచి నాకు నా ప్రతి సినిమా ఒక లెసన్ నేర్పించాయన్నారు. ఎదిగే కొద్ది మంచి నేర్చుకుంటూ చెడుని వదిలేయాలి అనే దిశగా వెళ్తున్నానన్నారు.
కేవలం ఫిదా సినిమాలోహీరోయిన్ పల్లవిమాట్లాడే తెలంగాణా యాస పట్ల ఆకర్షణ ‘లవ్ స్టోరీ’లో కూడా అదే యాసను వాడామన్నారు. సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిందని రిలీజ్ చేస్తే థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం కానీ ప్రేక్షకులు వచ్చి చూస్తున్నారు. ఈ కరోనా సమయంలో తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదని అన్నారు. సినిమాలో కంటెంట్, నిజాయితి వల్లే ఇవాళ లవ్ స్టోరి సక్సెస్ అయ్యిందని తెలిపారు.
–శ్రీనివాసరెడ్డి ( 9885864418)