మనమందరం పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటాం.శక్తికొలదీ సంబరాలు జరుపుకుంటాం. మన ఆనందాన్ని మన వారితో పంచుకుంటాం. అది సహజంగా జరిగే వేడుక. కాని మా తల్లులకు మాత్రం అందరికీ కలిపి ఒకేసారి జరిగే పుట్టినరోజు వేడుక ఇది. దీనికి మదర్స్ డే అని పేరు పెట్టారు. బర్త్ డే లాగ మదర్స్ డే. తల్లిగా గర్వించే వేడుక. భారతీయ సంస్కృతి మాతృదేవోభవ అని తల్లికి అత్యున్నత స్థానం ఇచ్చింది. అంతేనా.. ఈ సృష్టిలో కొన్ని లక్షల రకాల తల్లులను కూడా భగవంతుడు సృష్టించాడు, కాని అలాంటి తల్లులకే తన ఉలి ద్వారా ప్రాణం పోసి రుణం తీర్చుకుంటున్నారు శిల్పులు.
ఇక్కడ కనిపించే తల్లీబిడ్డల శిల్పకళాకృతులు రాళ్ళకు ప్రాణమిచ్చిన అమ్మతనానికి ప్రతీకలు. తల్లీ నిన్ను దలంచి… అని శిలల్లో దాగిన శిల్పాలకు అమ్మతనమద్దిన శిల్పకారుల సృజనాత్మక విన్యాసానికి నిలువుటద్దాలు. సాహిత్యం , చిత్రలేఖనమే కాదు శిల్పకళా వైశిష్ట్యంలోనూ అమ్మకు అమ్మే సాటి ఈ అందమైన శిల్పాలే అందుకు సజీవ సాక్ష్యాలు అమ్మని సృజించిన శిల్పకారులకు వందనం… అమ్మలుగా అవతరించిన రాళ్ళ బతుకు ధన్యం …