మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు

*ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం(17-3-24) సాయంత్రం సినీ నటులు, నిర్మాత మాగంటి మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా మురళీమోహన్ ను తెలుగు దర్శకుల సంఘం అ్యక్షులు వీరశంకర్, పలువురు దర్శకులు, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీత మురళి మోహన్ మాట్లాడుతూ జగమే మాయ అనే చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యానని, ఈసినీ రంగంలో 10 నుంచి 15 ఏళ్లు ఉంటానని అనుకున్నానని కానీ సినీ కళామతల్లి 50 వసంతాలు తన ఒడిలో కొడుకులా పెంచి పోషించిందిదని చెప్పారు.
అనేక కష్టనష్టాలు ఎదుర్కొని ఈ రంగంలో స్వశక్తితో నిలిచానన్నారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావు ను ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉండాల్సి వచ్చింది అన్నారు.

తను సంపాదించిన సామ్మును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టానని సగటు మనిషికి మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అందుబాటులో ఉండాలని జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థ నడిపించినట్లు తెలిపారు. కొన్ని సినిమాలు కొంటూ కొన్ని సినిమాలు తీస్తూ సాగిపోతున్న తన సినీ జీవితంలో కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేరడం వల్ల నటభూషణ శోభన్ బాబు డిస్ట్రిబ్యూషన్ వద్దని వారించారన్నారు. ఆయన చెప్పినట్టే కొందరు తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు. దానివల్ల కొంత నగదును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభతో పాటు కొంత కష్టపడాలని అప్పుడు సినీ రంగం అక్కున చేర్చుకుంటుందన్నారు. తనకు సన్మానాలు అంటే ఇష్టం లేదని, మిత్రులు చైతన్య జంగా, వీవీఎస్ వర్మ ల ప్రోద్భలంతో ఈ సన్మానానికి అంగీకరించానని చెప్పారు.

మహిళా తారామణులు మురళీమోహన్ కు గజమాలతో గౌరవించారు. కార్యక్రమంలో పలువురు నిష్ణాతులైన వైద్యులకు సినీ టీవీ కళా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు. సినీ దర్శకులు రావిపల్లి రాంబాబు సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు. టీవీ సినీ నటుడు లోహిత్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురు సినీ దర్శకులు నిర్మాతలు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అవార్డు గ్రహీత మిమిక్రి రమేష్ చేసిన మిమిక్రీ అందరిని అలరించింది.

కె. రత్నాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap