గుంటూరుకు చెందిన “బండి కల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్” నిర్వహిస్తున్న 6వ జాతీయస్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కవి రచయిత బండికల్లు జమదగ్ని, ప్రధాన కార్యదర్శి బండికల్లు శ్యాంప్రసాద్ సంయుక్తంగా తెలియజేస్తున్నారు. కవిత నిడివి 30 పంక్తులకు మించకూడదు. సామాజిక అంశాలను ప్రతిబింబించే కవితలకు, క్లుప్తత, గాఢత వున్న కవితలకు ప్రాధాన్యత. ఒక్కొక్కరికీ రెండు కవితల వరకు పంపే అవకాశం వుంది. ఒక్కో కవిత రెండు కాపీలు పంపాలి. కవిత రాసిన పేజీ పై కవి పేరు గానీ, ఇతర సమాచారం గానీ రాయకూడదు. హామీపత్రం పై మాత్రమే ఆ వివరాలు రాయాలి.
ఆసక్తి గల కవులు తమ కవితలను బండికల్లు జమదగ్ని, ప్లాట్ నెం. 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు-522 002 చిరునామాకు 2022 జులై 30వ తేదీలోపు పోస్టు ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ పంపాలి. ఎంపిక విషయంలో నిర్వాహకులకు పూర్తి స్వేచ్ఛ వుంటుంది. ప్రధమ బహుమతికి ఎంపికైన కవితకు రు.2,500/- ద్వితీయ బహుమతి కవితకు రు.2,000/-లు, తృతీయ బహుమతి కవితకు రు.1,500/- మరియు రు.750/-ల చొప్పున నాలుగు ప్రోత్సాహక బహుమతులుంటాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు బండికల్లు జమదగ్ని, 98482 64742 నెంబరులో సంప్రదించవచ్చు.