విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

ఈ నెల 29 మరియు 30 వ తేదీలలో హైదరాబాద్ రంగస్థలి ఆడిటోరియమ్ లో టికెట్స్ ప్రదర్శనలు

జ్ఞానపీఠ్ అవార్డును ఇంటి ముందుకు తెచ్చి, తలుపు తట్టి, రచయత రావూరి భరద్వాజ గారి అరచేతిలో పెట్టిన గ్రంధము పాకుడు రాళ్లు.
560 పేజీల కధాంశము, 24 మంది కళాకారులు, 45-50. పాత్రలు, అంకిత భావముతో ఒక గంటా 40 నిముషాలలో పాత్రోచితంగా ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర రంగం తెరవెనుక జీవన వ్యవస్థకు దర్పణము. ఇతివృత్తం గంభీరంగా వుండి చదువు కొనడానికి వీలుగా భరద్వాజ గారు ఈ గ్రంథాన్ని రచించారు. చాలా సున్నితమైన పాత్రలు. వాటికి జీవమ్ పొసిన కళాకారులు కృషి, కథకు తగ్గ వాతావరణాన్ని వేదికపై సృష్టించిన కళాదర్శకులు అందరికీ అభినందనలు. ప్రధాన పాత్ర మంగమ్మగా మొదలై మంజరిగా మారి పేరు, ఖ్యాతితో బాటు సిరి సంపదలు పొందటానికి పడ్డ అవస్థల ఇతివ్రుత్తాన్ని ప్రతిభావంతముగా నటించిన భావనకు అభినందనలు. ప్రదీప్ పలు పాత్రల్లో చక్కగ కనిపించారు. దాదాపు ప్రదర్శన మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు విభిన్న రూపాల్లో హావ భావాలు ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు అందుకొన్న పధాన పాత్రధారి భావన నటనా కౌశల్యము అభినందనీయము.

అలాగే కథనాన్ని నడిపించే ప్రయోక్తగా ప్రధాన భూమికను శ్రీ వికాస్ పోషించారు. కిక్కిరిసిన ప్రేక్షకులతో నిండి నరంగస్తలి ఆడిటోరియమ్లో ఆద్యంతము ఆసక్తి గా తిలకించి కరతాళ ద్వనులతో అభినందనలు తెలిపారు. ఇతర పాత్రలలో నితీష్, రవళి, కిరణ్, సందీప్, లావణ్య, మాధురి, వర్మ, ప్రియాంక, రాహుల్ మొదలైన నటీనటులందరూ సమిష్టిగా శ్రమించి ప్రొయొగాత్మక ఈ నాటకాన్ని విజయవంతము చేసారని చెప్పడము అతిశయోక్తి కానే కాదు. 1980 ప్రాంతములో ఎల్.బి. శ్రీరామ్ ముగ్గురు నటులు 15 పాత్రలు పోషించి పద్మవ్యూహం నాటికను రచించి దర్శకత్వము వహించి ప్రయోగము చేసి ప్రశంసలు అందుకొన్నారు. రిబా థియేటర్ ఎన్సెంబెల్ సంస్థ సమర్పించిన పాకుడురాళ్లు ప్రయోగాత్మక నాటకము హైదరాబాద్ గచ్చిబౌలిలో గల రంగస్థలి ఆడిటోరియమ్ లో ఈ నెల 29 మరియు 30 వ తేదీలలో ప్రదర్శించారు. ఈ నాటకం తొలి ప్రదర్శన కు టికెట్స్ దొరకక పలువురు నిరాశగా వెనుదిరిగి పోయారు. టికెట్ రూ. 250/- అమ్మినా ఇంతటి ఆదరణ రావడం నిర్వహకులకు సంతోషాన్ని కలిగించింది.

కె. లక్ష్మణ రావు

2 thoughts on “విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

  1. Hyderabad is a place with varied interests and audiences. Telugu Drama and the stage artists have a special place in the hearts of several people. Late Shri Ravuri Bharadwaj’s novel “Pakudu Raallu” is a direct exposure of the enormous struggle young artists face in making their ground to stand firm in the industry

  2. గొప్ప నవలను నాటకంగా మలచడం ఒక ఎత్తైతే దానిని తొలిసారి అద్భుతంగా ప్రదర్శించడం గొప్పవిషయం అంతే గాక 250/రూపాయల టికెట్ పెట్టినా సీట్ లో దొరకక పోవడం మరింత గొప్ప విషయం .నాటక రంగానికి ఇలాంటి మంచి రోజులు రావాలి .good article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap