దర్శకుడు గా రెండు దశాబ్దాలలో 34 సినిమాల అనుభవంతో పరుగు ఆపని దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక కథనం…
పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా ప్రేమికులకు పరియచయాలు అవసరం లేని పేరు. ఎందుకంటే లాగ్.. లెంగ్త్ అనేది ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి పూరీ జగన్నాధ్. అది తన తీతలో కావచ్చు.. రాతలో కావచ్చు. ఎంత ఇంపార్ట్ తో..ఎంత క్రిస్ట్ గా.. గ్రిప్పింగ్ గా కథ చెప్పాలని తనకి తానే ప్రతి సినిమాకి పోటీ పెట్టుకుంటారు పూరీ జగన్నాధ్. రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా సినిమా రంగంలోకి ప్రవేశించి.. పార్టు.. ధిల్లానా లాంటి సినిమాలు ప్రారంభించి మధ్యలోనే ఆ ప్రాజెక్ట్స్ కి అబార్షన్ అయిపోయినా డిప్రెస్ కాని వ్యక్తి పూరీ జగన్నాధ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్మి ఇచ్చిన అవకాశం బద్రితో దర్శకుడిగా తొలి హిట్ కొట్టారు. పరుగు ప్రారంభించి.. ఇరవయ్యేళ్లు అవుతుంది. రెండో సినిమాగా జగపతిబాబుతో బాచి చేశారు. ప్లాఫ్…పవన్ కళ్యాణ్ వల్ల బద్రి ఆడింది అంటూ కామెంట్స్ వచ్చాయి. అయినా పూరీ పట్టించుకోలేదు.
క్యారెక్టర్ ఆరుస్టుగా ఉన్న రవితేజని హీరోగా పరిచయం చేస్తూ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే ప్రేమకథా చిత్రం తీశారు. ప్రేక్షకులు బ్రహ్మరథం మొదలు పెట్టారు. మధ్యలో కన్నడంలోకి వెళ్ళి తమ్ముడు సినిమా రీమేక్ యువంజ అనే శివరాజ్ కుమార్ తో తీశారు. ఆ సినిమా షూటింగ్ లండన్ లో చేశారు. అక్కడ పాపులర్ పత్రిక ది గార్డియన్ పూరీ జగన్నాథ్ గురించి.. యువంజ సినిమా గురించి తమ పత్రికలో రాసింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ అప్పు అనే సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్. అదే కథతో తెలుగులో రవితేజతో ఇడియట్ గా తీశారు. టైటిల్స్ పెట్టడంలో పూరీ పంచ్ ఏమిటో ప్రేక్షకులకి తెలియచేసిన మొదటి సినిమా అది. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత మళ్ళీ రవితేజ కాంబినేషన్ లో అమ్మా..నాన్న ఓ తమిళమ్మాయి తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ కే బ్లాక్ బస్టర్. ఆ తర్వాత నాగార్జునతో శివమణి.. ఎన్.టి.ఆర్ తో ఆంధ్రావాలా సినిమాలు.. ఒకేసారి తీశారు. శివమణి సక్సెస్ కాగా.. ఆంధ్రావాలా డిజప్పాయింట్ చేసింది. నిజం చెప్పాలంటే పూరీ జగన్నాధ్ ఓ కమర్షియల్..యాక్షన్ సినిమా చేయడానికి చేసిన మొదటి ప్రయత్నం ఆంధ్రవాలా. ఆ సినిమా ఫ్లాప్ తో ప్రారంభం కావల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయినా అధైర్య పడకుండా తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా పరిచయం చేస్తూ 143అనే మంచి ప్రేమకథా చిత్రం తీశారు. కాని ఆ సినిమా నిరాశపర్చింది. ఆ దశలోనే తనలోని మాస్ ప్రేక్షకుడిని తన రైటింగ్ టాలెంట్ కి జత చేసుకున్నారు.
స్టయిలిష్ మేకింగ్ అలవర్చుకున్నారు. నాగార్జునతో తీసిన సూపర్ ఎబౌ.. యావరేజ్ అన్పించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన పోకిరి.. పూరీజగన్నాథ్ కెరీర్ గ్రాఫే మారిపోయింది. తనలోని స్టెలిష్.. కమర్షియల్ డైరెక్టర్ ని ప్రేక్షకులకి పరిచయం చేశారు.
పూరీ జగన్నాధ్. ఆంధ్రా షోలే అన్పించుకునే రేంజ్ లో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్ధలు కొట్టింది పోకిరి. ఇక ఆ తర్వాత పూరీ తన పరుగు ఆపలేదు. దేశముదురు.. చిరుత.. బుజ్జిగాడు. . నేనింతే.. ఏక్ నిరంజన్.. గోలీమార్.. నేను నా రాక్షసి.. బుద్దా తేరీ బాప్ సినిమాలు చేసుకుంటూ పోయారు. కొన్ని రికార్డ్స్ సృష్టించాయి.. మరికొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అదే సమయంలో ఆర్థికంగా కూడా మోసపోయానని పూరీ జగన్నాథ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మళ్ళీ మహేష్ బాబుతో చేసిన బిజినెస్ మాన్ తో ఫామ్ లోకి వచ్చారు.
నెగెటివ్ క్యారెక్టర్ లా భయపెట్టి.. భ్రమింపజేసే హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా ఇంటెన్సిటీతో డీల్ చేసి..యూత్ కి..మాస్ కి ఓ పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ లా తీర్చిదిద్దారు పూరీ.. మళ్ళీ దేవుడు చేసిన మనుషులు… కెమెరామన్ గంగతో రాంబాబు.. ఇద్దరమ్మాయిలతో.. హార్ట్ అటాక్.. సినిమాలతో ప్లాప్ ..యావరేజ్ ఇలాంటి టాక్స్ తెచ్చుకున్నారు. ఎన్.టి.ఆర్ తో వక్కంతం వంశీ కథతో చేసిన టెంపర్ సినిమా మళ్ళీ పూరీ తన మార్క్ చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్.. ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనతో టెంపర్ సినిమా పూరీ కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి.. ఇజమ్.. లోఫర్.. పైసావసూల్… మెహబూబా సినిమాలు చేశారు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ బాక్సాఫీస్ కొట్టారు పూరీ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. అనన్య పాండేలతో పాన్ ఇండియా చేస్తున్నారు పూరీ జగన్నాద్ అది పూరీ జగన్నాధ్ కెరీర్ గ్రాఫ్ అయితే టాలెంట్ ని కనుగొనడంలో.. ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు పూరీ. హీరోయిన్స్ అమీషా పటేల్.. రేణుదేశాయ్.. నీలాంబరి.. తనూరాయ్.. అసిన్.. రక్షిత.. సమీక్ష.. పూజ.. అనుష్క శెట్టి.. హన్సిక.. నేహాశర్మ.. సంజనా గట్రాని.. శియా గౌతమ్.. ఆదాశర్మ.. దిశాపటానీ.. నేహాశెట్టి మొదలైన వారిని తెలుగు తెరకి పరిచయం చేసింది పూరీజగన్నాధ్.
తెలుగులో రామ్ చరణ్ ని..సాయిరామ్ శంకర్ ని..కన్నడంలో పునీత్ రాజ్ కుమార్.. ఇషాన్ లను పరిచయం చేశారు. చక్రి.. రఘుకుంచెలను సంగీత దర్శకులుగా పరిచయం చేసింది పూరీ జగన్నాధే. అలాగే భాస్కర భట్ల రవికుమార్.. పెద్దాడ మూర్తి.. కందికొండ లను గీత రచయితలు పరిచయం చేసారు.