రవివర్మ కే అందని అందాలు …!

రవివర్మ ‘కొత్త పెయింటింగ్స్’కు మోడల్స్… మన సినీ బుట్టబొమ్మలు..!!
 12 మంది హీరోయిన్లతో ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ సరికొత్త ప్రయోగం
రవివర్మ.! ఒకప్పటి అద్భుత చిత్రకారుడు… ఎందరో దేవతా మూర్తులకు రూపాన్ని కల్పించి, యావత్ దేశ ప్రజల చేత తన చిత్రాలు పూజింపబడేలా చేసుకున్న చిత్రకారుడు. ఆ కాలంలో తను వాడిన రంగులు ఇప్పటికీ చాలామందికి పాఠాలు… స్త్రీ చిత్రణలో అందెవేసిన చేయి తనది.. అనేక చిత్రాలు… ఎవరో అప్పటి మోడల్స్.. ఎంతసేపు తన చిత్రాలు గీసేవరకూ అలా నిలబడిపోయారో.. తమ బొమ్మలు చూసుకుని ఎంత మురిసిపోయారో… ఆ రవివర్మ బొమ్మల్లాగే తామూ బుట్టబొమ్మల్లా చిత్తరువులైపోతే ఎంత బాగుండు అనుకోని స్త్రీలు వుండరుగా..? కదా…

సరిగ్గా ఒకప్పటి హీరోయిన్ సుహాసినికి కూడా అదే తట్టింది… అసలు సేమ్, రవివర్మ బొమ్మలను ఇప్పటి ప్రఖ్యాత నటీమణులతో రిక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది… అబ్బే, అలా గీసేవారెవరు… ఆ రంగుల కలయిక ఎంతమందికి అబ్బుతుంది..? అలాగే చిత్రాలు రావాలని ఏముంది..? అందుకని ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ను అడిగింది… ఏముంది మేడమ్… నా కెమెరా ఉంది కదా అన్నాడు తను… ఇద్దరూ కలిసి పన్నెండు చిత్రాల్ని ఎంపిక చేశారు… ప్రఖ్యాత నటీమణుల్ని అడిగారు… సుహాసిని చెప్పాక ఎవరు కాదనగలరు..? వచ్చారు.. కూర్చున్నారు.. ఫోజులిచ్చారు… అయితే అది అంత వీజీ కాదండోయ్….. సేమ్ కాస్ట్యూమ్స్.. సేమ్ లైటింగ్… జువెలరీ… సేమ్ సెట్స్..
చాలా కుదరాలి… అనేకం అమరాలి… అచ్చు గుద్దినట్టు రవివర్మ చిత్రాల్ని పోలేలా ఫోటోలు తీయాలంటే మాటలు కాదు.. చీరెలో, జాకెట్లో, బ్యాక్ డ్రాపో, గాజులో, నగలో కాస్త గ్రాఫిక్స్ కవర్ చేయొచ్చు…
కానీ మొహాల్లో ఆజీవం అలాగే ఉట్టిపడాలి… కానీ బాగా కష్టపడ్డాడు చెన్నై కి చెందిన స్టిల్ ఫొటోగ్రాఫర్ జి. వెంకట్రాం…. ఖుష్బూ, రమ్యకృష్ణ, సమంత, శృతిహాసన్, శోభన, ప్రియదర్శిని, నదియా, మంచు లక్ష్మి.. ఇలా 12 మంది హీరోయిన్లు అచం్చ రవివర్మ చిత్రాలుగా మారిపోయారు…. బాగున్నాయి కదా.. అవునూ, సుహాసిని వీటినేం చేస్తుంది..? సుహాసినికి నామ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ స్వచం్చదసంస్థ ఉంది… దాని తరఫున పలు రంగాల్లో ఆమె మహిళలకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది.. ఆమెకూ రవివర్మ చిత్రాలంటే పిచ్చి… ఈ రీక్రియేషన్ అనేది ఓ సరదా మాత్రమే కాదు, వీటితో కేలండర్లు, బుక్లెట్స్ వేస్తున్నది….
ఆ డబ్బు నామ్ (NAAM Foundation) యాక్టివిటీసకు ఉపయోగపడతాయి… మహిళ సాధికారత, స్వేచ్ఛ, స్పూర్తి ప్రదర్శనకు ఇవి ఉపయోగపడతాయి అని ఏదో మాటలు చెబుతుంది సుహాసిని… ఈ చిత్రాలకూ ఆమె చెప్పే పదాలకూ ఏ సంబంధమూ లేదులెండి గానీ… డబ్బు మాత్రం ఆమె మంచి పనులకే వాడుతుంది అందులో సందేహం లేదు… చూసేవాళ్లకు కూడా ఈ బొమ్మలు కన్నులపండుగే …

ఈ విధంగా రవి వర్మ గారి పేరు సామాజిక మాధ్యమాలలో మరో మారు వైరల్ అయ్యింది. భంగిమలు కుదిరినట్టు ముఖం లో రవివర్మ బొమ్మ వెలుగు ఆత్మ ప్రతిబింబించడం లేదని కొందరు అభిమానులు ఆవేదన చెందినప్పటికి ఒక సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికినందుకు వారిని అభినందిద్దాం.

1 thought on “రవివర్మ కే అందని అందాలు …!

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap