ఫిబ్రవరి 5న స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో విజయవాడలో “సలామ్ ఇండియా” ఆర్ట్ కాంటెస్ట్ & ఆర్ట్ ఎగ్జిబిషన్
చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ మరియు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీన కాకరపర్తి భవన్నారాయణ కళాశాల (కెబిఎన్ కాలేజ్) నందు ఉదయం 10 గంటలకు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ చిన్నారులు మరియు క్రియేటివ్ టీమ్ లచే ఆర్ట్ ఎగ్జిబిషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ వివరాలు:
గ్రూప్ -ఏ విభాగంలో కిండర్ గార్డెన్ చిన్నారులకు సెల్యూట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, గ్రూప్ -బి విభాగంలో ఒకటి నుండి మూడవ తరగతి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు, గ్రూప్ – సి విభాగంలో నాలుగు నుండి ఏడవ తరగతి విద్యార్థులకు యూనిటి ఇన్ డైవర్సిటి, గ్రూప్ -డి విభాగంలో ఎనిమిది నుండి పదోవ తరగతి విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ అవర్ డిఫెన్స్, గ్రూప్ – ఇ విభాగంలో ఇంటర్మీడియట్ పిజి విద్యార్థులకు గ్లోరియస్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంశాలపై చిత్రాలు గీయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్,ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేయడతాయన్నారు.
ఈ కాంటెస్ట్ లో పాల్గొన దలచిన విద్యార్థులు 7981435393 ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా గానీ, salaamindiaartcontest@gmail.com ఈమెయిల్ ద్వారా గానీ,www.spoorthicreativeartschool.com గూగుల్ లింక్ ద్వారా గానీ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
అదే రోజు సాయంత్రం నిర్వహించబోతున్న బహుమతీ ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిథిగా, కేబీఎన్ కాలేజీ సెక్రటరీ & కరస్పాండెంట్ తూనిగుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావులు ప్రత్యేక అతిథులుగా, డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి స్పెషల్ ఆఫీసర్ డా. వెలగా జోషి గౌరవ అతిథిగా, వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్ గవర్నర్ శ్రీమతి మితింటి శారద ఆత్మీయ అతిథులుగా హాజరు కానున్నారు.