హైదరాబాద్, చైతన్యపురిలో మూడు రోజుల ఫైన్ ఆర్ట్స్ క్యాంప్ అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యపురిలో సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ‘ఫస్ట్ స్టెప్ ఆర్ట్’ పేరుతో నిర్వహిస్తున్న ఫైన్ ఆర్ట్స్ క్యాంపును కోదండరాం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫైన్ ఆర్ట్స్ కళ గొప్పతనాన్ని తెలిపే విధంగా, ప్రతిభను వెలికితీసే విధంగా క్యాంపును నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా పెయింటింగ్ లో ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సును సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్ వారు ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. బీ.ఎఫ్.ఏ. లో సీటురాని వారికి సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్లో చక్కని అవకాశం లభిస్తుందన్నారు.
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎన్వీ రమణారెడ్డి మాట్లాడుతూ ఫైన్ ఆర్ట్స్ ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ ఫైన్ ఆర్ట్ క్యాంపులో 8 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు. ఈ క్యాంపు సోమవారం వరకు కొనసాగుతుందని క్యాంపు నిర్వాహకులు రేవతి సామల, క్యూరేటర్ నరేష్ బొల్లు తెలిపారు. కార్యక్రమంలో చిత్రకారులు గుర్రం మల్లేశం, పీజే స్టాలిన్, ఆశా రాధిక, లావణ్య డల్, నయాకోటి దామోదర్, దేవేంద్ర తంబూరు, సుంకోజు రమేష్ పాల్గొన్నారు.
-కళాసాగర్
—————————————————————————–
‘First step’ art camp in Hyderabad
Professor Kodanda ram inaugurated the ‘First step’ art camp conducted by Samala Lakshmaiah Institute of fine arts in Chaitanyapuri. 8 famous artists participating in art camp on February 24th to 26th, organizer Revathi Samala, curated by Naresh Bollu.
గుడ్ . ఇటువంటి వి కార్టూనిస్టులకి కూడా కండక్ట్ చేసేవాళ్ళుంటే బావుణ్ణు.
Congratulations 🎊 be first grade