“ఎప్పటికీ..అందరికీ సంజీవదేవ్” పుస్తకావిష్కరణ

(వైభవంగా‌‌ సంజీవదేవ్ గారిఇంట్లో “ఎప్పటికీ.. అందరికీ సంజీవదేవ్..” పుస్తకావిష్కరణ.)
డాక్టర్ లలితానంద ప్రసాద్రచించిన.”ఎప్పటికీ..‌ అందరికీ.‌సంజీవదేవ్ పుస్తకాన్ని ఎస్.మహేంద్ర
దేవ్ ఆవిష్కరించారు. శనివారం(19.8.2023) సాయంత్రం తుమ్మపూడిలోని సంజీవదేవ్ గారింట్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సభలో డాక్టర్ మన్నవ సత్యనారాయణ… ప్రారంభోపన్యాసంశం చేశారు.’ఐహికము,
పారమార్ధికానికి అతీతంగా ఓ వింతైనలోకంలో సంజీవదేవ్ గారు జీవించారు. ఆ లోకాన్ని ఆయనే సృష్టించుకున్నారని’ డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారన్నారు‌. సంజీవదేవ్ జీవితం ఓవింతగా కనిపిస్తుంది. ఎలిమెంట్రీ స్కూల్లో కూడా సరిగ్గా చదువుకోని వ్యక్తి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించడం ఓ అద్భుతం అన్నారు. సంజీవ దేవ్ చాలా సున్నితమైన వ్యక్తి. ఎవరైనా ఉత్తరం రాస్తే మర్నాడే ఆయన్నుంచి రిప్లయ్ వచ్చేదని చెప్పారు.‌ ఓ కళాతపస్వి, సాహితీ వేత్త, తాత్వికుడు సంజీవ్ దేవ్… ఆయనది అరుదైన వ్యక్తిత్వం అన్నారు‌ మన్నవ.

సభకు కె. రవి బాబు గారు అధ్యక్షతవహించారు.‌‌ సంజీవ్ దేవ్ గారి కుమారుడు, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకులు, ఆర్ధికవేత్త ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ మాట్లాడుతూ… సంజీవ దేవ్ అందరికీ చెందినవాడని అన్నారు.‌ నాల్గోతరగతి వరకు చదువుకున్నా, ఆయన అపారమైన విజ్ఞానవేత్తగా, తాత్వికుడిగా ప్రపంచ ప్రసిద్ధిచెందారన్నారు.

రాహుల్ సాలంకృత్యాయన్ గారు సంజీవదేవ్ గారికి ఎంతో సన్నిహితులన్నారు.‌ రాహుల్ సాలంకృత్యాయన్ తుమ్మపూడికి వచ్చి, ఓ వారం రోజులు వుండివెళ్ళారన్నారు.
తుమ్మపూడిలోని సంజీవదేవ్ గారిల్లు కవులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు విడిది ఇల్లులావుండేదన్నారు. అలాగే అనేక సాహిత్య సమావేశాలు కూడా జరిగేవని చెప్పారు. లలితానంద్ ప్రసాద్ గారి పుస్తకంలో సంజీవదేవ్ వ్యక్తిత్వం, జీవితంలోని వివిధకోణాల్నిఆవిష్కరించారని చెప్పారు.

ప్రజాసాహితి, సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ… సంజీవదేవ్ గారు చిత్రకళపై సాధికారంగా మాట్లాడేవారన్నారు. ఈరోజుల్లో కళారంగం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు.‌
సంజీవదేవ్ గారి చిత్రకళా పరిజ్ఞానం అరుదైందన్నారు. నిజానికి ఇప్పుడు చిత్రకారులు తక్కువై పోయారు.‌ ఇలస్ట్రేషన్ వేసేవారే చిత్రకారులుగా వ్యవహరింప బడుతున్నారన్నారు.

చినుకు మాస పత్రిక సంపాదకులు నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ… సంజీవదేవ్ అప్పుడే కాదు; ఇప్పుడే కాదు, ఎప్పటికీ అందరివాడన్నారు. ఈ పుస్తక రచయితలలితానందప్రసాద్ గారు సంజీవదేవ్ గారికి వీరాభిమాని అన్నారు.
ఆవిషయం ఈ పుస్తకంలో అడుగడుగునా… కనిపిస్తోందన్నారు. సంజీవదేవ్ గారు ప్రాకృతికజీవి. ప్రాకృతిక కళాకారుడు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు.‌ సంజీవదేవ్ రచనల్లో… ఇతరుల గురించి చెప్పడమే కానీ, తన గురించి ఎప్పుడూ. ఎక్కడా చెప్పుకోలేదన్నారు.
సంజీవదేవ్ గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన సమకాలికుల నవలల్లో వెదకాలన్నారు. జీవితం కాంతివంతంగా వుంటేమృత్యువు ఆనందదాయకంగా వుంటుందని అనేవారు.

ఆయన జీవితాన్ని చాలా లైట్ గా తీసుకునేవారు. ఆయన ఏది చెప్పేవారో. అదే చేసేవార
న్నారు.‌‌.. సంజీవదేవ్ ఒకరోజు మరణిస్తారనగా తాను వేసిన ప్రాకృతిక చిత్రాల ఆల్బమ్ ను పక్కనే వుంచుకున్నారన్నారు.
చిత్రకళ అంటే ఎంతిష్టమో.. కవిత్వమన్నాకూడా సంజీవదేవ్ గారికి అత్యంత ఇష్టమని నండూరి రాజగోపాల్ చెప్పారు.‌ సంజీవదేవ్ గారికి వర్షమంటే ఎంతో ఇష్టమన్నారు.‌ వర్షం గురించి ఎప్పుడూచెప్పేవారట.

అలాగే… బకింగ్ హామ్ కాల్వలో పడవలు పోతుండటాన్ని చూడటం కూడా ఆయనకిష్టమన్నారు.
తన జీవితాన్ని తానే డిజైన్ చేసుకున్నారు. ఆయన జీవిత చిత్రానికి ఆయనే చిత్రకారుడన్నారు. సంజీవదేవ్ గారు ఎంత గొప్ప చిత్రకారుడైనా. ఎప్పుడూ స్కెచెస్ వేయలేదు. తన అనుభవంలో కొచ్చిన అందాన్ని, ఆనందాన్ని చిత్రాల్లోపొదిగారన్నారు.‌ చిత్రంతో మనం మాట్లాడటం కాదు.. చిత్రాలు కూడా మనతో మాట్లాడతాయని సంజీవదేవ్ గారనే వారన్నారు.

డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు సంజీవదేవ్ గారి వ్యక్తిత్వం గురించి… వివరించారు.
జితేంద్రబాబు మాట్లాడుతూ… చిన్నప్పటి నుండి సంజీవదేవ్ గారి పుస్తకాలు చదివేవాడినన్నారు. సంజీవదేవ్ గారితో తాను ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే వాడినన్నారు‌‌.
సంజీవదేవ్ గారి ప్రభావంతోనే తాను పుస్తకాల ప్రియుడిగా మారినా, చిత్రకారుడిగా మారినా, సంజీవదేవ్ గారి ప్రభావమేనన్నారు. సంజీవదేవ్ తెలుగువారికి చిరస్మరణీయుడన్నారు.

రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.‌‌.సంజీవదేవ్ గారితో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.‌ పుస్తకాలు రాయడం, వేదికలెక్కి… ఉపన్యాసాలు చెప్పడమే గొప్పకాదు. వ్యవసాయం చేయడం, కూలిపని చేయడం కూడా గొప్పే అని సంజీవదేవ్ గారనే వారన్నారు.

పుస్తక రచయిత డాక్టర్ లలితానంద్ ప్రసాద్ గారు సంజీవదేవ్ తో తనకు గల అనుభవాల్ని తెలిపారు.‌‌ సంజీవదేవ్ కు జీవితమే ఓ కళ. ఓ మనిషి ఎలా వుండాలో సంజీవదేవ్ గారిని చూసి నేర్చుకోవాలన్నారు. జీవితంలో అన్ని పార్శ్వాలను తడిమి, సమన్వయం చేసుకోవడం సంజీవదేవ్ గారి ప్రత్యేకత అన్నారు.‌

సభ ఆద్యంతం సంజీవదేవ్ గారి జ్ఞాపకాలతో పరిమళించింది. తొలిసారిగా ఎంతో మంది సంజీవ్ దేవ్ గారి ఇల్లు చూసి పరవసించిపోయారు.

ఎ. రజాహుస్సేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap