ఆగస్ట్ 19న, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ‘తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ఎస్ గోపాల్ రెడ్డి (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్), ఛోటా కె. నాయుడు, కె. కె.సెంథిల్ కుమార్, శరత్, కె. రవీంద్రబాబు, సి. రామ్ ప్రసాద్, హరి అనుమోలు, రసూల్ ఎల్లోర్ లను ఘనంగా సత్కరించారు. యువ సినిమాటోగ్రాఫర్స్ కార్తిక్ ఘట్టమనేని, ఉదయ్ గుర్రాలని సినిమాటిక్ విజనరీ అవార్డ్స్, సాయి శ్రీరామ్, దాశరధి శివేంద్ర, నగేష్ బ్యానల్, బాల్రెడ్డి, సినిమాటిక్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ తో సత్కరించారు. ఈ వేడుకలో దర్శకులు కోదండరామి రెడ్డి, వి.వి. వినాయక్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, సాయి రాజేష్, దామోదర్ ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.