“సేవ్ స్పారో” ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్.డిల్లీరావు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎన్.టి.ఆర్ జిల్లా
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ “పిచ్చుక ను చేసుకుందామా” మచ్చిక అనే నినాదంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంస్థ ల సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ని ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పిచ్చుకల మనుగడకై గత కొన్ని సంవత్సరాలుగా స్ఫూర్తి శ్రీనివాస్ చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యంగా వాటికి ఆవాసాలు(బర్డ్ హౌస్) లు ఏర్పాటు చేయటం వాటి పట్ల అవగాహన కల్పించేందుకు ఆర్ట్ కాంటెస్ట్ & ఎగ్జిబిషన్ నిర్వహించటం అభినందనీయమన్నారు.

మార్చి 20వ తేదీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్ లో విద్యార్థులూ, చిత్రకారులు పాల్గొని పర్యావరణం పట్ల మనకున్న బాధ్యతను తెలియపర్చాలన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉమెన్ వింగ్ ఇన్చార్జి సంధ్యారాణి, వర్కింగ్ కమిటీ మెంబెర్ శ్రావణ్ కుమార్, టీం మెంబెర్స్ లక్ష్మీ ప్రియాంక, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap