“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!’ పెద్దలకు ఈ పద్యం వినగానే.. స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన నరసింహస్వామి హిరణ్య కశిపుడ్ని సంహరించే ఘట్టం గుర్తుకు వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లతో సహవాసం చేసే ఈ పిల్లలకు ఆ పద్యం గురించి తెలుసా? అంటే.. ఆ పద్యమే కాదు భాగవతములోని ఏ పద్యమైనా దాని అర్థం, పరమార్థం చెబుతున్నారు. అందుకు కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈయనే.
నాన్నా.. భీష్ముడు ఎవరు? ఇచ్చిన మాట కోసం బలి చక్రవర్తి ఏం చేశారు?’ అని నాటి భాగవత గాథలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకునే
ప్రయత్నం చేస్తున్నారు నేటి చిన్నారులు. అంతే కాదు ఎంతో లయబద్దంగా భాగవత పద్యా
లను కూడా పాడుతున్నారు. ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా.. మన పోతన రాసిన పద్యాలను
ఔపోసన పడుతున్నారు. అందుకు కారణం.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు నేమాని పార్థసారధి (పార్డు).
పిల్లల్లో చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం కోసం భక్తి టీవీ చానెల్ లో ‘పలికెద భాగ వతము’ కార్యక్రమాన్ని అన్నీ తానై నడిపిస్తున్నారు.
రమణాచారి సంకల్పం శ్రుతిలయ ఫౌండేషన్ ద్వారా తూము నర్సింహదాసు కీర్త లను 72కు పైగా కంపోజ్ చేసి, పిల్లలతో పాడించారు పార్డు.
దానిపేరు ‘నాద నీవేదన’. ఆ కీర్తనలకు ఎస్పీ బాలు వ్యాఖ్యానం చెప్పారు. అంతకుముందు భాగవతంలోని అన్ని స్కందాల్లోంచి 324 పద్యాలను ‘హ్యుస్టన్లోని భాగ వతం ఆణిముత్యాల ట్రస్ట్’ సహకారంతో శలాక రఘు నాథశర్మ సారథ్యంలో పద్యాలను స్వరపరచి, అందంగా పాడారు పార్టు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచారి.. పార్టు సారథ్యంలో భాగవత పద్యాలను నేటి తరానికి అందించాలని ఆలోచన చేశారు. రమణాచారి సంకల్పంతో ‘పలికెద భాగవతము’ అనే రియాల్టీ షో పురుడుపోసుకున్నది. ఈ కార్యక్రమం కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే పాటలు,
ద్యాన్సులు వంటి రియాల్టీ షోలు ఉన్నాయి కానీ.. పద్యాలతో చేసే మొదటి కార్యక్రమం ఇదే. ఎలాంటి దిశ, నిర్దేశం లేని కార్య క్రమానికి అన్నీ తానై, చక్కటి రూపమిచ్చారు పార్టు.
మొదటి ఆడిషన్లోనే 98 మంది చిన్నారులను ఎంపిక చేశారు. వారికి వారానికి మూడు వర్క్ షాపులు నిర్వ హించి, పద్యాలు పాడేందుకు చక్కని వేదికను కల్పించారు. న్యాయ నిర్ణేతలుగా గరికపాటి నర్సింహారావు, జొన్నవి త్తుల, ఎస్పీబాలు వంటి ప్రముఖులను పిలిపించి.. కార్య క్రమాన్ని విజయవంతగా నిర్వహిస్తున్నారు పార్డు. ఈ కార్యక్రమానికి లైట్ బాయ్ దగ్గర్నుంచి.. ప్రొడక్షన్ పనుల వరకూ అన్ని బాధ్యతలు భుజానవేసుకొని, సెట్ లో వ్యాఖ్యాతగా ఉంటూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలా ఈ కార్యక్రమం 25 వారాలుగా భక్తి టీవీలో ప్రసారం అవు తూనే ఉంది.
కొత్తగా టీనేజర్లతో.. చిన్నపిల్లలతో మొదలు పెట్టిన ‘పలికెద భాగవతము’ విజ యవంతం అవడంతో.. అదే స్పూర్తితో టీనేజతో పద్యాలు పాడించడం మొదలుపెట్టారు పార్టు. దీని ఆడిష నకు 120 మంది వచ్చారు. వారందరికీ తన కీర్తన స్టూడి యోలోనే వర్క్ షాపులు నిర్వహించి రెండో ఎడిషను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లలు ఇంట్లో, కారులో, స్కూల్ లో, ఖాళీ సమయాల్లోనూ పద్యాలే పాడు తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోష పడుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తన భార్య, ఒలేటి శ్రీనివాస్ భాను, భరత్, ఓ స్టూడెంట్ సహకారం మర్చిపోలేనిదని అంటున్నారు పార్టు. ఈ నలు గురూ కలిసి.. 40 మంది చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్పీ రేటింగ్స్ తో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి అభినందనలు వస్తున్నాయి.
సింగర్ నుంచి సంగీత దర్శకుడిగా.. పార్థసారథి పుట్టి పెరిగింది. కాకినాడ. వీరిది సంగీత కుటుంబం. హైదరాబాద్ లో దాదాపు 30 యేండ్ల నుంచి ఉంటున్నారు. సంగీతం మీద ప్రేమతో, ఎస్పీ బాలును చూడ్డానికి హైదరాబాదు వచ్చి మొదటి ‘పాడుతా తీయగా’ కార్యక్రమం విజేతగా నిలిచారు. ఆ తర్వాత చెన్నై వెళ్లి మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో 150కిపైగా సినిమాలకు పాడారు. 4వేలకు పైగా ప్రైవేట్ సాంగ్స్ పాడారు. దాదాపు 12 దేశాల్లో ప్రద ర్శనలు ఇచ్చారు. 12 యేండ్లుగా ‘కీర్తనా అకాడెమీ’ పేరుతో పిల్లలకు పాడడంలో శిక్షణ ఇస్తున్నారు. సంగీత దర్శకుడిగా 70కి పైగా ఆల్బమ్స్ చేశారు. విశ్వనాథ్ ‘స్వరా భిషేకం’ సినిమాలో రెండు పాటలు పాటు నేమాని కంపోజ్ చేశారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది.
మొదటి రెమ్యునరేషన్ రూ.200 సినిమా పాటలు పాడకముందు పెండ్లిలో పాటలు పాడే వారు పార్థసారధి. ఆయన మొదటి రెమ్యునరేషన్ రూ.200. విశ్వనాల్ చేసిన ‘విశ్వనాథామృతం’ కార్య క్రమం బాగా పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు పాడుతా తీయగా, జీ సరిగమ, ఐడియా సూపర్ సింగర్ కార్యక్ర మాలకు సెలక్షన్ ప్యానెల్ లో ఉన్నారు పార్టు. ఈయనలో ప్రతిభను గుర్తించింది తండ్రి రామం. కాకినాడలో కెమిస్ట్రీ ప్రొఫెసర్. ‘ఏడాదికి పదివేలమంది ఇంజినీర్లు వస్తారు. కానీ సింగర్లు ఎక్కుమంది రారు. నీకేం కావాలో ఆలోచిం చుకో’ అంటూ ప్రోత్సహించారు రామం.
-డప్పు రవి