(శ్రీ వేంకటేశ్వర చిత్రాలతో పుస్తక ముద్రణకు క్రియేటివ్ చిత్రాలకు ఆహ్వనం)
శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (SKAWA), తిరుపతి ద్వారా ‘శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన’ ఒక పుస్తకం ప్రచురించ నున్నాము. 2005 శ్రీ కళాక్షేత్ర ఆవిర్భావం నుండి నేటివరకు చిత్రకళకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమము తలపెట్టినా, చాలామంది కళాకారులు ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు.
మీరిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతము మరో కార్యక్రమముతో ముందుకు వస్తున్నాము. చరిత్రలో మన చిత్రాలు ఒక పుస్తక ముద్రణ ద్వారా నిలిచిపోయేవిధంగా ఉండాలని “శ్రీ వేంకటేశ్వర” (శ్రీ బాలాజి) అనే అంశంపై కళాకారులచే చిత్రసృష్టి గావించాలన్నదే శ్రీ కళాక్షేత్ర సంకల్పం. చిత్రకారులు మీ మీ ఇండ్లల్లోనే ఉండి చిత్ర రచన చేయాలి. తదుపరి మీ చిత్రాలను (సెల్ కెమెరాతో తీసిన ఫోటోలు పంపకూడదు) ప్రొఫెషనల్ కెమెరాతో ఫోటో తీయించి skawatpt2005@gmail.com అనే ఈ-మెయిల్ కు పంపాలి. అలాగే మీరు చేసిన చిత్రానికి టైటిల్ మరియు చిత్ర వివరణ (ఇవ్వాలనుకుంటే) 4 లైన్స్ మించకుండా ఇవ్వవచ్చు. కళాకారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పూర్తి పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్, అడ్రస్ తదితర అంశాలు పంపించాలి. ఒరిజినల్ చిత్రం మీ దగ్గరే వుంటుంది. పుస్తకం విడుదల సందర్భంగా చిత్ర ప్రదర్శనకు మీ చిత్రం పంపాల్సి ఉంటుంది. ఫోటో మరియు వివరాలు మాకు పంపిచాల్సిన చివరి తేది 15-01- 2023. పుస్తకం విడుదల రాబోయే “ఉగాది” (22-03-2023) రోజు.
నిబంధనలు:_________________________________________________________
– జాతీయస్థాయిలో 20 సం॥రాల వయస్సు పైబడిన చిత్రకారులందరూ పాల్గొనుటకు అర్హులే.
– ఎంట్రీ ఫీజు ఉండదు. ఎంపిక చేయబడి ముద్రణకు అర్హత పొందిన ప్రతి కళాకారునికి పుస్తకం ఆవిష్కరణరోజు ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వబడును.
– పుస్తకంలో 150 నుండి 200 ల చిత్రాలు ఉంటాయి. (మా అంచనాకు మించి అర్హత పొందిన చిత్రాలు ఉంటే పేజీలు పెంచబడును).
– మీరు చిత్రం ఏ సైజు చిత్రించినప్పటికి A4 సైజులో 300 రిజల్యూషన్లో ఫోటోగ్రాప్ పైన తెలిపిన మెయిల్ కు పంపగలరు.
– చిత్రాలు ఏ మీడియంలో నైనా (Water Colour, Oil/Acrylic, Colour pencils etc…) చిత్రించవచ్చు.
– పుస్తకం మొత్తం కలర్లో ఉంటుంది. పుస్తక ముద్రణకు అయ్యే మొత్తం ఖర్చు శ్రీ కళాక్షేత్రయే భరిస్తుంది.
– శ్రీ కళాక్షేత్ర చిత్రాల ఎంపిక కమిటీని నియమిస్తుంది. ఎంపిక తుది నిర్ణయం ఈ కమిటీదే.
– కమిటీ ఎంపిక నిర్ణయం ప్రకారం పుస్తకంలో 1 నుండి 200 వరకు వరుస క్రమంలో ఉంచడం జరుగుతుంది.
– 1 నుండి 50 చిత్రాల వరకు ఒక్కొక్క చిత్రానికి ఒక ఫుల్ పేజీ కేటాయించబడుతుంది.
– కాల్యండర్ కాపీ వర్క్స్, డిజిటల్ వర్క్స్ అనుమతించబడవు. స్వయం కల్పనా సృష్టికి ప్రాధాన్యత వుంటుంది.
– గతంలో ఏదేని పుస్తకంలో ముద్రించబడ్డదైనా, ప్రదర్శనలో ప్రదర్శింపబడ్డ చిత్రమైనా అనుమతించబడదు.
నోట్: ఈ పుస్తకంలో మీమీ సంస్థల గురించిగానీ, కళాకారులు ఎవ్వరైనా స్వయంగా కాని ప్రకటన ఇవ్వాలనుకున్నా, ఇతర విషయాలకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు. సెల్ నెంబర్స్ : 9440367826, 7670835958, 9949851739.
ఎ. రామచంద్రయ్య, అధ్యక్షులు
డా॥ సాగర్ గిన్నె, ప్రధాన కార్యదర్శి