ఒకప్పుడు పేదరికంతో మగ్గిన ఈ కుర్రాడు లక్ష మందిని పైగా ఇంగ్లీష్ భాషలో ఎక్స్‌పర్ట్స్‌గా తీర్చిదిద్దే స్థాయికి చేరుకున్నాడు. తెలుగు భాషకే పరిమితమైన ఆయన ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుండి బంగారు పతకాన్ని స్వంతం చేసుకున్నాడు. ఇది నిజమైన కథ. వరంగల్ జిల్లాకు చెందిన అతడే చిరంజీవి. శ్రీ మేధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థకు అధిపతి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ గా, మెంటార్‌గా, ట్రైనర్‌గా ఎనలేని ఎక్స్‌పీరియన్స్ స్వంతం చేసుకున్న ఘనత ఆయనదే.
చిరంజీవి అంటే సినిమా నటుడు గుర్తుకు వస్తాడు. కానీ ఈ చిరంజీవి మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. విశాఖ నగరంలో చిన్నగా ఓ గదిలో ప్రారంభమైన స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ సంస్థ ఇపుడు కార్పొరేట్ కంపెనీ స్థాయికి చేరుకుంది. చిరంజీవి ఇంటి పేరు అంబరగొండ. ఫౌండర్‌గా… చీఫ్ కోచ్‌గా మేధ లాంగ్వేజ్ థియేటర్‌ను స్థాపించాడు.
ప్రపంచాన్ని ఇంగ్లీష్ భాష శాసిస్తోంది. దీనిపై పట్టు సాధించక పోతే ఎక్కడా బతకలేని పరిస్థితి నెలకొంది. తెలుగు వారి పరిస్థితి మరీ దారుణం. అంతా తెలుగు మీడియంలో చదివిన వారే. ఇంగ్లీష్ అంటేనే ఎలర్జీ. ఆ భాషంటేనే విపరీతమైన భయం. పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, ఉద్యోగస్తులు, బిజినెస్ టైకూన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కాలేజీ స్టూడెంట్స్, హౌజ్ వైఫ్‌స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లో మాట్లాడలేరు.
స్టేజ్ ఫియర్ తో కొందరు ఇబ్బంది పడుతుంటే…మరికొందరు భాషపై పట్టున్నా ఫ్యూయంట్‌గా ప్రసంగంచలేక చతికిల పడుతున్నారు. అవకాశాలు పొందాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌పర్ట్ కావాల్సిందే. లేకపోతే ఎన్నో అవకాశాలను కోల్పోతాం.
ఒకప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న చిరంజీవి..నేడు అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ ఇంగ్లీష్ ట్రైనర్‌గా పేరు సంపాదించారు. దీని వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉన్నది. మారుమూల వరంగల్ జిల్లాలోని పల్లె నుండి వచ్చిన ఆయన నేడు కార్పొరేట్ కంపెనీలకు ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రపంచంలోని పలు దేశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
తను స్థాపించిన సంస్థకు వరల్డ్ వైడ్‌గా నమ్మకమైన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌గా తీర్చి దిద్దారు. దానికో బ్రాండ్‌ను తీసుకు వచ్చారు. గేలిచేసిన వారు..మోసం చేసిన వారిని తట్టుకుని మార్కెట్‌లో నిలిచారు. డబ్బుల కోసం ఇబ్బందులు పడి..గోడలపై పేపర్లు అతికించిన ఆయన ఇపుడు ఫ్లయిట్లలో తిరిగే స్తాయికి చేరుకున్నారు. ఇదంతా కల కాదు వాస్తవం.
తెలుగు భాష కంటే ఇంగ్లీష్ భాష సులువైనదని..ఇంగ్లీష్ మేడ్ ఈజీ అంటూ ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశారు. స్పెషల్‌గా ఎలా ఈజీగా నేర్చుకోవచ్చో చేసి చూపించారు. వేలాది మంది స్టూడెంట్స్, అన్ని రంగాల వారు ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించి ఔరా అనిపించేలా చేస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్..మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌గా, లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్‌గా, ట్రైనర్స్‌గా, మెంటార్స్‌గా, అధ్యాపకులుగా … పలు ఫార్మాట్‌లలో దుమ్ము రేపుతున్నారు.
వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. మార్కెట్‌లో కోచింగ్ సెంటర్లు ఎన్నో వచ్చాయి. తక్కువ ధరకే ఇంగ్లీష్ నేర్పిస్తామంటూ బోగస్ సంస్థలు వచ్చాయి. కానీ మేధ మాత్రం అలాగే నిలబడింది. ఇంకా విస్తరిస్తోంది. పలు ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయింది.
ఇంగ్లీష్ భాషతో పాటు పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో కూడా నిపుణులుగా తీర్చిదిద్దుతారు మన చిరంజీవి. ఆయనకు డాక్టరేట్ వచ్చింది. ఒకనాడు చదువు కోసం అష్టకష్టాలు పడిన ఈ కుర్రాడు నేడు అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. ఇదంతా కాలపు పరీక్షలో ఎదుర్కోని నిలబడ్డాడు. అందుకే ఆయన జీవిత కథను ప్రముఖ రచయిత యుండమూరి వీరేంద్రనాథ్ ‘నేనే నా ఆయుధం ‘ పేరుతో పుస్తకం రాశారు.
అది ప్రచురించిన కొద్ది కాలానికే లక్షల్లో అమ్ముడు పోయింది. తిరిగి ముద్రణకు నోచుకుంది. కన్నడలో కూడా తర్జూమా అయింది. అక్కడ కూడా పాపులర్ . చిరంజీవి చేసిన కృషికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. యుఎస్ఏలోని జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ బెస్ట్ న్యూ జైసీ అవార్డు పొందారు. ఐఓయు నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. జాతీయ స్థాయిలో శిక్షా భారతి పురస్కార్, ఢిల్లీ తెలుగు అకాడెమీ నుండి ఉగాది పురస్కారం, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి ప్రశంసలు పొందారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల నుండి ప్రశంసలు పొందారు. ఎన్నో దేశాలు పర్యటించారు. ఆక్స్‌ఫోర్డ్ , పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్శిటీ, లండన్, అమెరికా, శ్రీలంక, కొలంబో, తదితర ప్రాంతాలు తిరిగారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే ప్రసంగిస్తారు. అంతగా పాపులర్ అయ్యారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో పట్టు సాధించిన చిరంజీవి టాగ్ లైన్ ఒక్కటే..అదే ఫైర్, వాటర్, స్కై,ఎయిర్, ఎర్త్ ఇవే మేధకు మూలం అంటారు.
పల్లె నుండి ప్రపంచాన్ని జయించిన చిరంజీవి మరిన్ని విజయాలు అందుకోవాలి. అత్యంత కష్టంగా భావించే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మరిన్ని మార్పులు తీసుకు రావాలి. మేధ ఇలాగే విస్తరించి ఆంగ్ల భాషాభిమానులను తయారు చేయాలి. చేతిలో పేపర్లు పట్టుకుని తిరిగిన చిరంజీవి ఇపుడు ఇంగ్లీష్ లో ‘విజేత ‘ – శ్రీమేథ అధినేత గా నిలిచారు. లైఫ్ ఈజ్ ఏ జర్నీ.. జస్ట్ అందుకోవడమే కదూ మిగిలింది.
-శ్రీనివాస్
very good service…