సీఎం జగతో మెగాస్టార్ చిరంజీవి గారి తో పాటు సినీ ప్రముఖుల భేటీ
2019-20 సంవత్సరం నంది అవార్డుల ఎంపికకు ఏర్పాట్లు ..
సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ..
ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై, షూటింగ్ కు అనుమతులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు నాగార్జున, డి.సురేష్ బాబు, రాజమౌళి, దిల్ రాజు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్, తదితరులు జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. లాక్ డౌన్లో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర సమస్యలను కూడా ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు.
అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి పైనా సీఎం జగన్ తో సినీ పెద్దలు చర్చించారు. దాదాపు గంటపాటు అనేక విషయాలపై సీఎంతో చర్చించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం జగతో చర్చించిన అంశాలపై మీడియాకు మెగాస్టార్ చిరంజీవి వివరించారు. సీఎం జగతో మెగాస్టార్ చిరంజీవి గారి తో పాటు సినీ ప్రముఖుల భేటీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఏడాది కాలంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకున్నామని, అయితే పరిస్థితులు అనుకూలించక కుదరలేదని, ఫైనల్ గా ఈ రోజు కలిశామని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తాము విన్నవించిన ప్రతి సమస్యపైనా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కారణంగా షూటింగ్స్ లేక ఇబ్బంది పడ్డామని, తెలంగాణలో కేసీఆర్ గారు అనుమతి ఇచ్చినట్లే ఏపీలో కూడా జగన్ గారు అనుమతి ఇచ్చారని మెగాస్టార్ అన్నారు. థియేటర్లు మినిమం ఫిక్స్ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని చెప్పారు. నంది అవార్డుల వేడుకలు పెండింగ్ లో ఉన్నాయని, 2019-20 సంబంధించి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నామన్నారు. టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ను కోరినట్లు చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. పరిశీలిస్తామని చెప్పారని అన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుందని, తమకు చాలా మేలు జరుగుతుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం జగన్ చెప్పడం తమకు చాలా ఆనందం కలిగించిందన్నారు. విశాఖలో స్టూడియో ఏర్పాటుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు అప్పట్లోనే భూమి ఇచ్చారని, దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తమ విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలిపారు. “సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సీ.ఎం. శ్రీ వైఎస్ జగన్ గారికి కృష్ణతలు. షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు.” చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.