అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

మంత్రముగ్ధులను చేసిన సెట్టింగ్లు – నాటకాభిమానులకు కనువిందు…
వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..
వియ్యాల వారి విందు.. హహహ నాకె ముందు.. అంటూ
అంతర్జాల వేదికపై అందరినీ ఆకట్టుకునేలా సాగింది మాయాబజార్ నాటకం. ఆదరణ కరువైన అలనాటి సురభి రంగస్థల పూర్వవైభవం కోసం శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థ 12-12-20, శనివారం సింగపూర్ తెలుగు టీవీ సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేశారు. జయానంద్ సురభి నాటక బృందంతో అప్పటి మాయాబజార్ నాటకాన్ని సరికొత్త సాంకేతిక విధానంలో ఆవిష్కరింపజేశారు. దాదాపు 60 మంది కళాకారులతో రెండు గంటలపాటు ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నాటకంలోని యుద్ధం, హాస్యం, యుగళ గీతాలు… సన్నివేశాలకు తగినట్టుగా లైటింగ్ ఏర్పాటు చేయడం విశేషం. ఘటోత్కచాశ్రమం వంటి ఘట్టాలకు అనుగుణంగా వేదికపై సహ జత్వం ఉట్టిపడేలా మంటలను ఏర్పాటు చేయడం విశేషం. వివాహ భోజనంబు పాటను పాత్రధారి ప్రత్యక్షంగానే పాడుతుండగా లడ్డూలు, బిందెలు ఎగురుతున్నట్టు సెట్టింగ్ ఏర్పాటుచేసి వీక్షకులను రంజింపజేశారు. ఎప్పటికప్పుడు సన్నివేశానికి తగినట్టుగా వేదిక తెరలను మార్చుతూ నాటక ప్రియులను ఆకట్టుకున్నారు.

తెలుగు నాటకరంగాన్ని ప్రేమించే అభిమానులు అసాంతం వీక్షించి అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదరణ కరువవుతున్న రంగస్థల నాటకాలను, కళాకారులను ఆదుకొని ప్రోత్సహిస్తున్న ఆస్ట్రేలియా, సింగపూర్ తెలుగు సంస్థలు చేసిన ఒక గొప్ప ప్రయత్నమే ఇదని అభినందించారు. కరోనా వంటి కష్టకాలంలో కళాకారులను ఆదుకోవ డానికి అన్ని దేశాల వారు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ నుంచి గణేశ్న రాధాకృష్ణ ప్రధాన సాంకేతిక నిర్వహకుడిగా వ్యవహరించారు. కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు “తెలుగుమల్లి, ఆస్ట్రేలియా అధ్యక్షుడు కొంచాడ మల్లికేశ్వరరావు, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ లో సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాతో పాటు ప్రపంచవ్యా ప్తంగా 4,500 మందికిపైగా వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap