తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్క్ షాప్
______________________________________________________
తిరుపతి ఆర్ట్ సొసైటీ, తిరుపతి వారి ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేది 2022 న తిరుపతి బాలాజీ కాలని, రాళ్ళపల్లి అతిథి గృహంలో రాష్ట్ర స్థొయి ఆర్ట్ కాంపు (పెయింటింగ్ వర్కషాప్) ను డా. సుకుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. మరియు చిత్రకళ యొక్క ఔనిత్యాన్ని వక్కాణించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 20 మంది చిత్ర కళాకారులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు డా. నాగవేటి హేమాక్షి ఆచారి చిత్రకారులను భారతీయ సంస్కృతి మరియు వారసత్వ అంశముపై రంగుల చిత్రాలను చిత్రించాలని కోరారు. ముఖ్య అతిథి చిత్రించడానికి కావలసిన కాన్వాస్ బోర్డులు ఇతర పరికరాలను చిత్రకారులకు ఇచ్చారు. మరుసటి రోజున 13వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని సాయంకాలం 4 గం. లకు చిత్రకారులు చిత్రించిన చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రొఫెసర్ పుత్తా రాజశేఖరరెడ్డి, ఫోర్మర్ రిజిస్ట్రార్ ద్రావిడ విశ్వవిద్యాలయం వారు తిలకించారు. ఇక సభ వేదిక పైన చిత్రకారులు చిత్రించిన చిత్రాలపై సమీక్ష చేశారు దామోదరచారి. వర్క్ షాప్ లో పాల్గొన్న చిత్రకారులు కూడా ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నామని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని తెలియజేశారు. పి. రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ పదవీ విరమణ చేశాక ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని కళలకే ఎక్కువ సమయానికి కేటాయించాలని అలా చేయటం వలన పిల్లలలో యువకులలో ఉన్నటువంటి సృజనాత్మకత వెలికి తీసి దేశానికి, ప్రపంచాలకు తెలియవచ్చునని ఇందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ చిత్రకారులకు ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ వర్క్ షాప్ లో చిత్రకారులు బాలు, హేమాక్షి ఆచారి, గాయత్రిదేవి, కొసన భాస్కర్ రావు, ఈరప్ప, మోహన ప్రియ, దామోదరాచారి, శ్రీదేవి, డాక్టర్ బాలాజీ సింగ్, హేమంత్ బాబు, లావణ్య, మల్లిఖార్జున ఆచారి, రవికుమార్, పూర్ణ, అంజి, అరుణ కుమారి, రాము, శ్రీనివాస్ కడలి తదితరులు పాల్గొన్నారు.
-మల్లిఖార్జున ఆచారి