- యోగివేమన విశ్వవిద్యాలయంకు సరికొత్త శోభ – కనువిందు చేసే కళాదర్శన్ ఆర్ట్ గ్యాలరీ
- రాయలసీమలో తొలి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన వైవీయు వీసీ ఆచార్య సూర్యకళావతి
యోగివేమన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ఒక ప్రత్యేక ఆకర్షణగా సరికొత్త శోభను సంతరించుకొని వై.వి.యు. కీర్తి ప్రతిష్టలను పెంచేలా ఉంటుందని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి అన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి ప్రత్యేక శ్రద్ధతో లలిత కళల శాఖ ఆధ్వర్యంలో నూతన పరిపాలన భవనంలో “కళాదర్శన్ ఆర్ట్ గ్యాలరీ ” ఏర్పాటయ్యిది. గ్యాలరీని ఉపకులపతి ఆచార్య సూర్య కళావతి, కుల సచివులు ఆచార్య దుబ్బాక విజయ రాఘవ ప్రసాద్, ప్రధానాచార్యులు కే. కృష్ణారెడ్డి తో కలిసి అక్టోబర్ 31 వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అందమైన ఆకృతులు, శిల్పాలు, ఆహ్లాదకరమైప చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీని రూపుదిద్దుకొందన్నారు. రాయలసీమలోనే తొలి ఆర్ట్ గ్యాలరీగా వై.వి.యు. గ్యాలరీ నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. గ్యాలరీ కోసం కృషి చేసిన లలిత కళల అధ్యాపకులను విద్యార్థులను అభినందించారు. విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్ట్ గ్యాలరీని సందర్శించి వెళ్లాలనేంతగా గ్యాలరీని రూపొందించామన్నారు.
మహనగరాల్లో ఉన్న గ్యాలరీలకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఉందన్నారు. ఆచార్య దుర్భాక విజయ రాఘవ మాట్లాడుతూ విద్యార్థులు చిత్రకళలో చక్కటి ప్రతిభను కనపరుస్తున్నారని ఇక్కడి చిత్రాలే సాక్ష్యం అన్నారు. మంచి నైపుణ్యత కలిగిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. ప్రధాన ఆచార్యులకే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఆర్ట్ గ్యాలరీ ఇంచార్జ్ లలిత కళల శాఖ సహ ఆచార్యులు డా. కోట మృత్యుంజయరావు మాట్లాడుతూ వివిధ రకాలైన పదార్థాలతో శిల్ప ఆకృతులు రూపొందించామని అలానే గ్రాఫిక్ చిత్రకళ, పెయింటింగ్స్ 40 వరకు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యం, పలు రకాల ఇతివృత్తాలు ఇక్కడి చిత్రాల్లో కనిపిస్తాయన్నారు..లలిత కళల శాఖ విభాగాధిపతి డాక్టర్ మూల మల్లికార్జున రెడ్డి, వై.వి.యు పాలకమండలి సభ్యులు ఆచార్య పి. పద్మ డాక్టర్ వైపి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.ఎన్.ఈశ్వరరెడ్డి, ఐ క్యు ఎ సి సంచాలకులు ఆచార్య ఎం.వి. శంకర్, సి.డి.సి.డి. డాక్టర్ వై. సుబ్బరాయుడు, లలిత కళల శాఖ అధ్యాపకులు సిహెచ్ వెంకటేష్, సిహెచ్. అప్పల చారి, బి. చిన్న రాయుడు, బి. వీరప్ప, డి వెంకటేష్ యాదవ్, విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
-కళాసాగర్ (9885289995)