చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి చిత్రకళపై ఆసక్తి పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర, తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం(16-9-2023) తిరుపతి, శ్రీరామచంద్ర పుష్కరిణిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్ కి అనూహ్య స్పందన లభించింది.
తిరుపతి మరియు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 100 విద్యా సంస్థల నుంచి 1500 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
1 నుంచి 10 తరగతి వరకు నిర్వహించిన ఈ కాంటెస్ట్ లో 1,2,3 తరగతుల వారిని సబ్ జూనియర్స్ గా విభజించి వారికి నచ్చిన అంశంపై, 4,5,6 తరగతుల వారిని జూనియర్స్ గా విభజించి వారికి తిరుపతిలో మీకు నచ్చిన ప్రదేశం అనే అంశంపై 7,8,9,10 తరగతుల వారిని సీనియర్స్ గా విభజించి వారికి ప్లాస్టిక్ రహిత తిరుపతి అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా చిన్నారులు తమ చిత్రకళా నైపుణ్యంతో చక్కటి సందేశాత్మక చిత్రాలను చిత్రించి ఆహుతులను అలరించారు.
ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్స్ కి ప్రశంసా పత్రాలు, గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికలు ముఖ్య అతిథులు చేతులు మీదుగా ఆదివారం(17-9-2023) మధ్యాహ్నం రెండు గంటలకు అందజేయటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, నడ్డి నారాయణ, ఎస్.రెడ్డప్ప,గురునాథం, ముకేష్, జి.మురళీ, సుజాత, ముని లక్ష్మి, తహస్సున్నిసా, ఓ.వి.రమణ, సాగర్ గిన్నె, ఆనంద్, లావణ్య, దివ్య, హేమప్రియ, రత్నశేఖర్, విజయవాడ ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యులు సునీల్ కుమార్ అనుమకొండ, గిరిధర్ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్, ఎస్.పి.మల్లిక్ లు పర్యవేక్షించగా భారీ సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.