ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఇందులో భాగంగా మొదటి కార్యక్రమం వపా గారి చిత్రాల రూపకల్పన విజయవంతంగా పూర్తయింది.
రెండవ కార్యక్రమంగా వడ్డాది పాపయ్య గారి శత జయంతి సందర్భంగా వారి చిత్రాలతో మరియు జీవితం విశేషాలతో రూపుదిద్దుకున్న సావనీర్ ‘వపా కు వందనం’ ఆవిష్కరణ రేపు జరగబోతుంది. మరియు పలు చోట్ల జరపబోయే చిత్రకళా ప్రదర్శనలలో భాగంగా విశాఖపట్నంలో మొదటి ప్రదర్శన జరగబోతుంది. ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ మరోసారి కమిటీ సభ్యులను అందరిని అభినందిస్తు…
అందరం కలిసి ఒకరోజు సరదాగా గడుపుదాం…
ఆ మహాచిత్రకారున్ని మనసారా స్మరించుకుందాం…
డా. గిన్నే వెంకటేశ్వర్లు (సాగర్)
ప్రధాన కార్యదర్శి
శ్రీ కళాక్షేత్ర, ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్,తిరుపతి.