విన్సెంట్ విలియం వాంగో

కళాకారుడు కోరుకునేది గుర్తింపు. తాను గీసిన బొమ్మ, తాను ప్రదర్శించిన నటన శభాష్ అని మెచ్చుకుంటే పొంగిపోతాడు. ఆ అభినందనలే అతనికి ఆహారం. ఆ అభినందనలే అతన్ని మరింత ముందుకు నడిపిస్తుంది.
ఆ ఆభినందనలకోసం, గుర్తింపుకోసం ఎంతగా తపిస్తాడో లెక్కకట్టలేము. అయితే కళాకారులందరూ అభినందనలు అందుకున్న అదృష్టవంతులు కారు. జీవితంలో పేదరికం ఎదుర్కొంటున్నా తాము ఇష్ట పడిన కళను వదులుకోలేక, ఆ కళలో కృషిచేస్తున్నా తగిన గుర్తింపు రాక అనామకులుగా మిగిలిపోతారు. అనామకుడిగా వుండిపోవటం వేరు, తిరస్కారానికి గురవటం వేరు.
ఇది మరింత ఇబ్బంది కలిగించే పని. తాను ఎంతో గొప్పవనుకుని చిత్రాలు గీస్తుంటే అతను ఒక పిచ్చి వాడు, అతను గీస్తున్నవి పిచ్చిగీతలు అంటుంటే దానికి తట్టుకుని నిలబడటానికి ఎంతో గుండె ధైర్యం వుండాలి. అంత గుండె ధైర్యం సాధ్యమా!

మానసికంగా పలురకాల ఇబ్బందులకు గురై, తాను చనిపోయిన తర్వాత మహాగొప్ప చిత్రకారుడు అనిపించుకున్న ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాంగో. దశాబ్దకాలంలో 2,100 చిత్రాలు గీశాడు. అందులో 860 ఆయిల్ పెయింటింగ్స్. వీటిలో అధిక శాతం తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో గీసినవి. అందులో పోస్టాట్స్, సెల్స్ పోర్టబు, ల్యాండ్ స్కేప్ట్, స్టిల్ లైన్లు వున్నాయి.

Vango painting

బతికుండగా వాంగో గీసిన చిత్రాలు మరణం తర్వాత నవీన చిత్రకళకు పునాది అని, మోడ్రన్ ఆర్ట్ పితామహుడు అని అన్నారు.
పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో, బాల్యం మండి నలుగురితో అంతగా మాట్లాడేవాడు కాదు. ఏవో ఆలోచనల్లో మునిగితేలుతుండేవాడు. పీరియ గా వుంటున్న వాంగో ఏమవుతాడో అనుకు న్నారు తల్లిదండ్రులు.
చివరికి కళాకారుడు కాలేకపోయినా కళాఖండా లను అమ్మే డీలర్ అయ్యాడు. ఎవరి బదులో పని చేస్తూ, ఐరోపా ఖండమంతా తిరుగుతుండేవాడు. పుట్టింది హాలెంలో అయినా మిగిలిన ఐరోపా దేశాలన్నీ అతనికి ఇష్టమే. ఉద్యోగరీత్యా పోలెండ్ నుండి లండన్ వెళ్ళాల్సి వచ్చింది. ఐరోపా ఖండంలో దూరంగా వున్న ద్వీప దేశం ఇంగ్లండ్.

ఆ దేశానికి బదిలీ అంటేనే వాంగో కి భయం వేసింది. అంతదూరం వెళ్ళాలా అని దిగులుపడి, డిప్రె షలోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ లో నుండి బయటకు రావటానికి మతాన్ని ఆశ్రయించి క్రైస్తవ మిషనరీల దగ్గర పని చేసినా అతని ఆరోగ్యం కుదుటపడలేదు. తన మానసిక ఇబ్బంది నుండి బయటపడేందుకు పెయింటింగ్ ని ఆశ్రయించాడు.
అలా 1881లో తిరిగి హాలెండ్ చేరి బొమ్మలు గీయటం మొదలు పెట్టాడు. ఆర్థికంగా తమ్ముడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అప్పటికే అతని వయసు 28 సంవత్సరాలు. పాలాలలో పనిచేసే కూలీల చిత్రాలను ఎక్కువగా గీస్తుండేవాడు. .
రంగుల విషయంలో కూడా లేతరంగులదే ప్రాధా వ్యత. ఇలా పోలెండ్ లో ఎంత కాలం బొమ్మలు గీసినా ఆదాయం, గుర్తింపు రెండూ రావని భావించిన వాంగో తన మకాం ప్యారిస్ కి మార్చాడు. ఐరోపా ఖండపు సాంస్కృతిక కేంద్రం ప్యారిస్. పేరున్న చిత్రకారులు అక్కడ వున్నారు.

Vango painting

1888లో ప్యారిస్ చేరటం ఒక రకంగా అతనికి మేలుచేసింది. చిత్రాలకు వాడే రంగుల విషయంలో మార్పు సాధించాడు. భావం వ్యక్తీకరించటంలోనూ మెరుగయ్యాడు. దక్షిణ ఫ్రాన్స్ లోని ఎర్లెస్ లో స్థిరపడి ఆలివ్ వృక్షాల బొమ్మలు, గోధుమ పొలాలు, పొద్దు తిరుగుడు పూల ఆందాలను ఎక్కువగా చిత్రీకరిం చాడు.ఎంతగా కష్టపడి,ఎంత గొప్ప చిత్రాలను చిత్రీ కరించినా అతనికి గుర్తింపు కరువైంది. . అప్పటికే డిప్రెషన్ కి ఒకసారి గురైనా వాన్ గోహ లో మానసిక సమస్యలు తిరిగి బయటపడ్డాయి. మనసు స్థిరంగా వుండటం లేదని తెలుసు. మానసిక సమస్యలను చక్కదిద్దుకోకపోగా శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. సరిగ్గా ఆహారం తీసుకునేవాడు కాదు. కాని విపరీతంగా తాగుతుండేవాడు.

తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరి స్థితిలో ఒక స్నేహితుడి మీద బ్లేడ్ లో దాడిచేయబోయి, అది విఫలం అవటంతో తన చెవిని తానే కోసుకు న్నాడు. తెగిపడిన చెవును జాగ్రత్తగా కాగితంలో చుట్టి తనకు సెక్స్ సేవ అందించిన వేశ్యకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాని చెవి కోసిన బాధ, చెవి లేకుండా బతకాల్సి వచ్చిందన్న దిగులు లేదు అతనిలో, మనుషులతో కలవటం మానేశాడు. రాత్రివేళ ఒంటరిగా, లైట్లు వేసుకుని పనిచేస్తూ ఏవేవో శబ్దాలు చేస్తూండే వాడు. అటువంటి పిచ్చి వాడు తమ మధ్య వుండటానికి వీలులేదని, ఆ వీధివారు చేసిన ఫిర్యాదుకు వాంగోని తీసుకువెళ్ళి పిచ్చాసుపత్రిలో చేర్చారు.

పిచ్చాసుపత్రి నుండి బయటకు వచ్చి, ఒక సేవకుడిని నియమించుకుని ప్రశాంత వాతావరణంలో పెయింటింగ్స్ వేసుకుంటూ గడపాలన్నది వాంగో ఆలోచన. అప్పుడప్పుడే అతని పెయింటింగ్నిసాటి పెయింటర్స్ గుర్తించి, తమ సమావేశాలకు, ఎగ్జిబి షకు ఆహ్వానం పంపటం మొదలు పెట్టారు.
వాన్ గోహ్ గీస్తున్న బొమ్మలు, ఎంచుకుంటున్న థీమ్ లన్నింటిలో ఆతను అనుభవిస్తున్న ఒంటరితనంచే పైచేయిగా వుండేది. తీవ్ర మానసిక ఇబ్బందినుండి బయటపడలేక పోయిన వాంగో తామ గీస్తున్న గోధుమ పొలంలోకి రాత్రివేళ నడుచుకుంటూ వెళ్ళి పిస్టోలో కాల్చుకున్నాడు. .

అయితే ఆ బుల్లెట్ లోపలి కీలక అంగాలను తాకలేదు. వెళ్ళి వెన్నులో ఆగిపోయింది. తానే తిరిగి నడుచుకుంటూ నడుచుకు వచ్చాడు. వైద్యులు సర్జరీ చేయలేదు. చికిత్సచేసి ఒంటరిగా అతని రూమ్ లో కూర్చో పెట్టారు. వెంటనే పైప్ తీసి వెలిగించుకుని గుప్పుగుప్పున పొగ వదలసాగాడు.
ప్రమాదం తప్పిందనుకున్నారు. అంత గాయం అయినా బాధ ఏమాత్రం ముఖంలో లేకపోవటం ఆశ్చర్యం వేసింది. అందరితో సరదాగా మాట్లాడుతున్నాడు. కాని గాయంతో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా రెండు రోజుల తర్వాత మరణించాడు.
29 జూలై 1890వ వాంగో మరణించేసరికి అతని వయసు కేవలం 37 సంవత్సరాలే. అతడు బతికుండగా ఎవరూ హర్షించలేదు అతని ఆర్ట్ ని. ఆ తర్వాత ఎంత గొప్ప ఆర్ట్ అని ఎందరు పొగుడు తున్నా అది వినేందుకు అతను లేడు, అదే జీవితపు విచిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap