మిత్రులారా,
వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజిలాండ్ వేదికగా అంతర్జాలంలో జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా,సాహిత్యాభిమానులకు సాదర ఆహ్వానం. ఈ పరంపరలో గత ఏడు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు భారత దేశం, అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలలో దిగ్విజయంగా జరిగిన సంగతులు మీకు తెలిసినవే.
ఇప్పుడు అటు ఆక్లండ్ మహానగరం (న్యూజీలాండ్) లో సభా ప్రాంగణంలో వైభవంగానూ, ఇటు మీ నెట్టింట్లో అంతర్జాలంలో ఆత్మీయంగా 24 గంటలకి పైగా నిర్విరామంగా జరిగే ఈ 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో సుమారు 50 దేశాల సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. ఆయా విశేషాలు జత పరిచిన మూడవ సమగ్ర ప్రకటనలో చూడండి. ఇప్పటి దాకా హైదరాబాద్ కి చెందిన శుభోదయం గ్రూప్ వారు, దాసుభాషితం వారు, మలేషియా తెలుగు సంఘం వారు తమ ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి మా ధన్యవాదాలు.
అంతే కాదు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి You Tube Chanel లో వీడియో ఆహ్వానం ఈ క్రింద వీడియోలో చూడండి. స్పందించండి.
వక్తలకి ఆఖరి అవకాశం….
మా ఆహ్వానాన్ని మన్నించి అనేక దేశాల నుండి ఇప్పటి దాకా స్పందించిన వక్తలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాం. ఆహ్వానిత సినీరంగ సాహితీవేత్తలు, సాహితీ రంగంలో నిష్ణాతులు న్యూజీలాండ్ లో వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు…ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం సుదూర దేశాలైన అమెరికా, కెనడా, భారత దేశం నుంచి అనేక మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. అంతే కాదు. ఈ సదస్సుకి అనుబంధంగా న్యూజీలాండ్ లో రెండవ అతిపెద్ద నగరం అయిన క్రైస్ట్ చర్చ్ నగరం లో మరొక సాహితీ సమావేశం కూడా జరుగుతోంది. ప్రపంచం నలుమూలలా తెలుగు భాష సాహిత్యాల ప్రాభవాన్ని చాటిచెప్పడమే మా సంస్థ ఆశయం కదా!
మీ అందరి సౌకర్యార్ధం ప్రసంగ వ్యాసాలు, తదితర వివరాలు మాకు అందవలసిన ఆఖరి తేదీ ఆగస్ట్ 15, 2022 (భారత దేశం అమృతోత్సవం దినం) కి పొడిగించబడింది.
ప్రసంగ వ్యాసం, ఇతర వివరాలు పంపించవలసిన నమోదు పత్రం లింక్ (Please copy & paste the link).
https://tinyurl.com/8va-prapanca-sadassu
ఐదు ఖండాల తెలుగు సాహితీవేత్తలు పాల్గొనే ఈ 8వ ప్రపంచ సాహితీ తెలుగు సదస్సు గత 7వ ప్రపంచ సదస్సులో (2020) సాధించిన వీక్షకుల రికార్డు (సుమారు 30 వేల మంది) ని అధిగమిస్తుంది అని అందరి నమ్మకం.
భవదీయులు,
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), , రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా).