అపర సిద్ధేంద్రయోగి, కూచిపూడి నాట్యతిలకులు, పద్యభూఫణ్ డా. వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి సందర్భంగా శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్డు అకాడమీ గుంటూరు వారి నిర్వహణలో పరమ గురువునికి ‘బ్రహ్మాంజలి’.
ఈ కార్యక్రమం అన్నమయ్య కళావేదిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు 29 జూలై 2022 శుక్రవారం ఉదయం 9 గం. లకు శ్రీ సాయి మంజీర వ్యవస్తాపకులు కాజా సుబ్రమణ్యంగారు, ఆలయ అధ్యక్షులు మస్తానయ్యగారు, భూసరపల్లి వేంకటేశ్వర్లుగారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనతో ప్రారంభించి వెంపటి చిన సత్యంగారి శిష్యుడైన రాజా సుబ్రమణ్యంగారు శిష్య ప్రశిస్యులతో సుమారు మూడువందల చిన్నారుల బృందంతో ‘బ్రహ్మాంజలి’ సమర్పించారు. కాజా సుబ్రమణ్యంగారు మాట్లడుతూ కూచిపూడి నాట్యం ప్రపంచం మొత్తానికి తెలియజేసిన వెంపటి చిన సత్యంగారి శిష్యుడను ఆయినందుకు పరమసంతోషంగా ఉందన్నారు. శిష్య ప్రశిష్యులతో ఇలాగే రాబోయే తరాలుకూడా ఇలాగే కొనసాగాలని అన్నారు. అనంతరం భూసరపల్లి వేంకటేశ్వర్లుగారు మాట్లాడుతూ వెంపటి చినసత్యంగారి శిష్యుడైన కాజా సుబ్రమణ్యంగారు ప్రతి సంవత్సరం వెంపటి చినసత్యంగారి వర్ధంతిని చాలా ఘనంగా న్విహిస్తారని గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా సాదారణంగా జరిపారని ఈ సంవత్సరం ఇంతమంది బృందంతో గురువుగారికి ‘బ్రహ్మాంజలి’ ఎంతో కన్నులవిందుగా చెప్పలేనంత ఆనందాన్ని పొందానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారి శిష్యులకు వెంపటి చిన సత్యంగారి జ్ఞాపికను ఆందజేశారు. మద్యాహ్నం వెంపటి చిన సత్యంగారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కొన్ని నృత్యాలను అభినయించారు. ఇక సాయంకాలం కాజా సుబ్రమణ్యంగారు తన శిష్యులకు జ్ఞాపికలను అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆనందోత్సాహాంగా జరిగాయని పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముగించారు.
–మల్లిఖార్జునాచారి