హైదరాబాద్ కు చెందిన డిజైనర్ అండ్ ఆర్టిస్ట్ వెంకట్ గడ్డం రూపొందించిన చిత్రాలు, మ్యూరల్స్, కొలేజ్ లతో ‘ఇన్నర్ కాలీ’ పేరుతో కళాకృతి ఆర్ట్ గేలరీలో ఆగస్ట్ 6 నుండి 8 వరకు ఒన్ మేన్ షో జరిగింది. ఇందులో ప్రదానంగా మహిళా సాధికారత పై వేసిన 36 యూనిక్ పెయింటింగ్ లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా వెంకట్ గడ్డం డిజైన్ చేసిన డ్రెస్సెస్ ను, కొలేజ్, మ్యూరల్స్ తో నిర్వహించిన ఈ ప్రదర్శన బి.జె.పి. జాతీయ కార్యవర్గ సభులు వివేక్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ డాన్సర్ సంధ్యారాజు పాల్గొన్నారు.