కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు

“మంచి కథలు రావడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని, ఇటువంటి కథల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి కథలు వెలువడతాయని” రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక గౌరవ సంపాదకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు. ఆగస్ట్ 7, ఆదివారం ఉదయం విజయవాడ, ఠాగూర్ గ్రంథాలయంలో రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో జరిగిన కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు జాతియ స్థాయి సింగల్ పేజీ కథల పోటీ విజేతల బహుమతి ప్రధానోత్సవ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి శాంతి శ్రీ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం వివిధ రంగాలలో ప్రముఖులు గుమ్మా సాంబశివరావు, కావూరి సత్యవతి, పులిపాటి దుర్గారావులకు ఒక్కొక్కరికి 5000 నగదుతో పాటు, జ్ఞాపికలతో కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలను అతిధులు ప్రధానం చేశారు. అలాగే జాతీయస్థాయిలో నిర్వహించిన సింగల్ పేజీ కథల పోటీ విజేతలైన ఖమ్మం జిల్లాకు చెందిన వేణు మరీదుకు ప్రధమ, అనకాపల్లి కి చెందిన జి. రంగబాబుకు ద్వితీయ, విజయవాడకు చెందిన బివీ శివప్రసాద్ కు కన్సోలేషన్ బహుమతుల కింద నగదు సాలువ దండ ప్రశంసా పత్రాలతో సన్మానించారు. కార్యక్రమాన్ని రమ్యభారతి పత్రిక సంపాదకులు చలపాక ప్రకాష్, పోపూరి పుష్పాదేవి నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap