ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బంగారు పతకాలు
…………………………………………………………………………….

చిత్రకళా నైపుణ్యం విద్యార్థుల మేధాశక్తిని మరింతగా పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. అమీర్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు (31-12-24) ఆదివారం నెల్లూరు, టౌన్ హాల్లో బహుమతులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, నారాయణ ఆసుపత్రి ఏజీఎం సి.హెచ్. భాస్కరరెడ్డి, 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్, నారాయణ వైద్య కళాశాల హెచ్డీ జ్యోతి, ఆయుర్వేద వైద్యులు-కరోనా నివారణ నిపుణులు గొనిగి ఆనందయ్య, సృష్టి ఆర్ట్ అకాడమీ నిర్వాహకులు తిమ్మిరి రవీంద్ర, క్రియేటివ్ హార్ట్స్ ఆర్ట్ అకాడెమి నిర్వాహకులు చిత్రకారులు ఆకొండి అంజి, ప్రముఖ చిత్రకారిణి, కొమల ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఎన్. అన్నపూర్ణ, పాల్గొన్నారు. అమీర్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు, నిర్వాహకులు అమీర్ జాన్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ఆసాంతం టీ.వీ. నటుడు హరిబాబుగారు తన వ్యాఖ్యానంతో ఉత్సాహంగా నిర్వహించారు.

ముందుగా నాట్యాచార్య డేగల సాంబశివరావు శిష్యబృందం తమ సాంప్రదాయ నృత్యాలతో ఆహుతులను అలరించారు. అనంతరం ముఖ్య అతిథి 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమీర్ తను కళాకారుడిగా విజయాలు సాధిస్తూనే, గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన ఆర్టిస్టుగా గుర్తింపు పొంది, చిన్నారి చిత్రకారులను ప్రోత్సహించడానికి తన వంతుగా గత ఎనిమిది సంవత్సరాలుగా జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది మంది చిన్నారులకు బహుమతులిస్తున్నాడు. ఇలాంటి సంస్థలకు తన వంతు సహాయం ఎప్పుడు వుంటుంది అన్నారు. ఈ సభలో చిత్ర కళారంగంలో కృషిచేస్తున్న 64కళలు.కాం పత్రిక ఎడిటర్ కళాసాగర్ గారికి, క్రియేటివ్ హార్ట్స్ ఆర్ట్ అకాడెమి నిర్వాహకులు చిత్రకారులు ఆకొండి అంజి గారికి, ప్రముఖ చిత్రకారిణి, కోమల ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఎన్. అన్నపూర్ణ గారికి అత్మీయ సన్మానం చేశారు. తదనంతరం పాఠశాలల్లో విద్యార్థులను చిత్రకళలో ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్లను, స్కూల్ కరస్పాన్ డేంట్ లను సత్కరించారు. సుమారు 500 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

మళ్ళీ కరోనా జాడలు కనిపించడంతో ఈ సభలో 300 మందికి ఆయుర్వేద వైద్యులు-కరోనా నివారణ నిపుణులు గొనిగి ఆనందయ్య గారు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీచేశారు.

4 thoughts on “ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

  1. చిత్రకారులు,, కళా సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా update చేస్తున్న కళాసాగర్ గారికి అభినందనలు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap