దసరా సాంస్కృతికోత్సవాలలో భాగంగా మంగళవారం(10-10-23) విజయవాడ, దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి విశేష ఆదరణ లభించింది.
ఈ ఎగ్జిబిషన్ ను విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అనుమకొండ సరోజినీ దేవి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ బెస్ట్ ఫ్రం ది వేస్ట్ అనే కాన్సెప్ట్ తో తాను ఎన్నో ఏళ్ళుగా క్రాఫ్ట్ కళాకృతులను రూపొందిస్తున్నానని.. వాటన్నింటినీ తలదన్నే రీతిలో వినూత్న, విభిన్న సృజనాత్మక పద్దతుల్లో ఈ రోజు మహిళలు రూపొందించిన ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించే అవకాశం రావడం చాలా సంతోషంకరమన్నారు.
దాదాపు 30 మంది మహిళలు/యువతులు 100 కి పైగా కళాకృతులతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు, కళాశాల విద్యార్థులు, కళాకారులు, కళాప్రియులు తిలకించి పార్టిసిపెంట్స్ ని అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణకి కష్టపడిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉమెన్ వింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి సంధ్యారాణి ని ఉమెన్ వింగ్ ఇన్ చార్జి శ్రీమతి ఆమ్రపాలి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు పర్యవేక్షించగా… ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, కార్యక్రమ నిర్వాహకుడు స్ఫూర్తి శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ స్వాతి పూర్ణిమ, శ్రావణ్ కుమార్, టీం మెంబెర్స్ లక్ష్మీ సువర్చల, భవాని, రేష్మా, రజియా, రిజ్వాన, రమ్య, ఇంకా పలువురు సీనియర్, యువ చిత్రకారులు పాల్గొన్నారు.